అతడు ప్రపోజ్ చేశాడు.. ఒకే అన్నాను.. లవ్ స్టోరీ రివీల్ చేసిన అనుష్క
Rajitha Chanti
Pic credit - Instagram
30 May 2026
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందరి అభిమాన 'జేజమ్మ' అనుష్క శెట్టి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది
'బాహుబలి' సినిమాలో దేవసేనగా ఆమె నటన ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అరుంధతి, సైజ్ జీరో వంటి సినిమాలతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
అయితే, ఇప్పుడు అనుష్క సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తోంది. గతంలో తన ఫస్ట్ ప్రపోజ్ రివీల్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె తన స్కూల్ డేస్ నాటి తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
"నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి 'ఐ లవ్ యు' అని ప్రపోజ్ చేశాడు. నిజానికి ఆ వయసులో ఆ పదానికి అర్థం కూడా నాకు సరిగ్గా తెలియదు.
అతను నన్ను అలా అడిగినప్పుడు, అమాయకంగా ఏమీ తెలియక 'సరే' అని చెప్పేశాను" అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అనుష్క కామెంట్స్ వైరలవుతున్నాయి.
అనుష్క చెప్పిన ఈ సంఘటన చాలా క్యూట్‌గా ఉందని, ఆ వయసులో ఉండే అమాయకత్వం ఆ మాటల్లో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనుష్క సినిమాల పరంగా ఎంపిక చేసుకుంటూ నిదానంగా అడుగులు వేస్తోంది. చివరిగా 'ఘాటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు.