ఫరియా ఎదురుచూపులు.. సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిట్టి 

Rajeev 

30 May  2026

instagram

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. కానీ ఆతర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతుంది. 

మొదట సినిమాతోనే మంచి సాలిడ్ హిట్ అందుకుంది ఫరియా. జాతి రత్నాలు సినిమాలో ఫరియా నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి.

దీని తర్వాత మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, బంగర్రాజు, రావణాసుర తదిర సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సందడి చేసిందీ అందాల తార.

అలాగే లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో కథానాయికగా చేసింది ఫరియా. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు.

కానీ సత్యతో కలిసి ఆమె నటించి మత్తు వదలరా 2 సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో కామెడీ తోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఫరియా.

గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒకరాజు రీసెంట్ గా గాయపడ్డ సింహం సినిమాల్లో నటించిందీ అందాల తారు. ఇక బుల్లితెరపై కూడా కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జీగా చేసింది.

ప్రస్తుతం వల్లి మెయిల్ అనే డార్క్ కామెడీ మూవీలో నటిస్తోందీ ఫరియా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫరియా క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది.