AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ భవన్‌లో హైడ్రామా.. పోలీసులకు లొంగిపోయిన బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్!

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ శనివారం (మే 30) తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు వేదికైంది. సింగరేణి సంస్థకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కీలక నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం, ఆయన తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు.

తెలంగాణ భవన్‌లో హైడ్రామా.. పోలీసులకు లొంగిపోయిన బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్!
Former Mla Balka Suman Arrest
Balaraju Goud
|

Updated on: May 30, 2026 | 2:04 PM

Share

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ శనివారం (మే 30) తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు వేదికైంది. సింగరేణి సంస్థకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కీలక నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు తెలంగాణ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం, ఆయన తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు.

బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ బీ.ఆనంద్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఆయన్ను విచారించేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చారు. సుమన్ లోపల ఉన్నారనే సమాచారంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భారీగా పోలీసులు అక్కడ మోహరించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సుమన్‌ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు వచ్చారని ఆయన తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాగైనా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్‌లో పదేళ్ల జైలు శిక్ష పడేలా అక్రమ సెక్షన్లు జోడించారని, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని లాయర్ పేర్కొన్నారు. అయితే, తాము కేవలం విచారణ కోసమే వచ్చామని, నోటీసులు ఇచ్చి తీసుకెళ్తామని, విచారణ ఆధారంగానే అరెస్ట్‌పై నిర్ణయం ఉంటుందని ఏసీపీ స్పష్టం చేశారు. అలాగే పోలీసుల విధులకు అడ్డుతగలవద్దని భవన్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

అరెస్ట్ తప్పదని భావించిన బాల్క సుమన్ భవన్ లోపలి నుండి కిందకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ప్రభుత్వాన్ని, సింగరేణిలో జరిగిన రూ.15 వేల కోట్ల కుంభకోణాన్ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి, వివేక్ ప్రయత్నిస్తున్నారు. నాపై అక్రమంగా సెక్షన్లు పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది, 226 కేసులు భరించాను. ఇప్పుడు కూడా అదే రీతిన టార్గెట్ చేస్తున్నారు. నన్ను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను మేము ప్రశ్నిస్తూనే ఉంటాం” అని సుమన్ స్పష్టం చేశారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే ఆయన పోలీసులకు సరెండర్ అవ్వగా, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us