AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బల్లి తిని వదిలేసిన ఆహారం తింటే విషమవుతుందా? నిజమా, అపోహనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ఇంటి వంటగదిలో లేదా గదుల్లో బల్లులు తిరగడం సర్వసాధారణం. అయితే బల్లి తిని వదిలేసిన ఆహారాన్ని లేదా పండ్లను తింటే ఏమవుతుంది? అది విషపూరితంగా మారుతుందా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. ఈ విషయమై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బి.పి.ఎస్. త్యాగి స్పష్టతనిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

బల్లి తిని వదిలేసిన ఆహారం తింటే విషమవుతుందా? నిజమా, అపోహనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Lizard Contaminated FoodImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: May 30, 2026 | 2:37 PM

Share

మన ఇళ్లలో, ముఖ్యంగా వంటగదిలో బల్లులు తిరగడం సాధారణంగా చూస్తుంటాం. చాలా సార్లు మనం పండ్లను కోసి అలాగే టేబుల్‌పై వదిలేస్తుంటాం లేదా ఆహార పదార్థాలపై మూత పెట్టడం మర్చిపోతుంటాం. ఒకవేళ ఆ ఆహారాన్ని బల్లి తిన్నా లేదా నాకినా.. ఆ విషయాన్ని గమనించకుండా మనం తినేస్తే ఏమవుతుంది? అది నిజంగానే విషపూరితంగా మారుతుందా? అనే సందేహాలపై ప్రముఖ ఈఎన్‌టీ (ENT) నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ బి.పి.ఎస్. త్యాగి సోషల్ మీడియా ద్వారా కీలక విషయాలను పంచుకున్నారు.

డాక్టర్ త్యాగి తెలిపిన వివరాల ప్రకారం.. బల్లి ఆహారాన్ని ముట్టడం వల్ల అది నేరుగా విషంగా మారదు. కానీ, బల్లుల వంటి సరీసృపాల (Reptiles) శరీరంలో, లాలాజలంలో సాల్మొనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. బల్లి ఆహారాన్ని నాకినప్పుడు లేదా కొరికినప్పుడు ఆ బ్యాక్టీరియా వంటకాల్లోకి లేదా పండ్లలోకి చేరుతుంది. ఒక్కోసారి ఆహారంపై బల్లి కాటు వేసిన గుర్తులు కూడా స్పష్టంగా కనిపించవు. అలాంటి ఆహారాన్ని మనం తింటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురవుతాము.

ఈ కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) జరుగుతుంది. దీనివల్ల కడుపులో వికారం, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిరి కలిగిస్తుంది. డీహైడ్రేషన్‌కు దారితీసే విరేచనాలు (డయేరియా), జ్వరం, నీరసంగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితికి చేర్చి ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?:

వంటగదిలో లేదా డైనింగ్ టేబుల్‌పై ఉండే ఆహార పదార్థాలు, పండ్లపై ఎల్లప్పుడూ మూతలు ఉంచాలి. అరటి, నారింజ, యాపిల్ వంటి పండ్లను తినే ముందు నీటితో బాగా కడిగి, తొక్క తీసి తినాలి. అయితే, పండు చాలా మెత్తగా ఉండి, దానిపై బల్లి కాటు వేసినట్లు అనుమానం వస్తే, దాన్ని కడగడం కంటే పారేయడమే మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియా పండు లోపలికి కూడా వ్యాపించే అవకాశం ఉంది. బల్లి పడిన లేదా బల్లి ముట్టినట్లు తెలిసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

బల్లి తిన్న ఆహారం నేరుగా విషం కాకపోయినా, అది మోసుకొచ్చే బ్యాక్టీరియా వల్ల అంతకంటే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయనేది పచ్చి నిజం. కాబట్టి, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, ఆహార భద్రత నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us