AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టణ పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కానుక.. ఎప్పటి నుంచంటే.. ?

పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

పట్టణ పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల కానుక.. ఎప్పటి నుంచంటే.. ?
Minister Ponguleti Srinivas Reddy On Indiramma Houses
Balaraju Goud
|

Updated on: May 30, 2026 | 1:23 PM

Share

పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శనివారం (మే 30) బంజారాహిల్స్‌లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఏడాది తిరిగేలోగా ఈ లక్ష ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని, ఆ తర్వాత మలి విడతగా మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలాగా పేదలకు ఒకచోట ఇళ్లు ఇచ్చి, వారిని 30-40 కిలోమీటర్ల అవతలకు పంపించే ఆలోచన తమకు లేదని మంత్రి విమర్శించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఏ నియోజకవర్గ ప్రజలకు ఆ ప్రాంతంలోనే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇది పేదలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే కానుకని కొనియాడారు. పేదవాని గుమ్మం వద్దకే ప్రజా ప్రభుత్వ పథకాలు చేరేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇదిలావుంటే, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే తదితర శాఖలన్నీ ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ సమీకృత భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు రంగానికి ధీటుగా, కార్పొరేట్ తరహాలో మారుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై నిధుల భారం పడకుండా ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఫినిక్స్’కు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించామని, మరికొద్ది నెలల్లోనే 30 వేల చదరపు అడుగుల్లో ఈ భవనం పూర్తవుతుందని వెల్లడించారు. ఈ బంజారాహిల్స్ సమీకృత భవనంలో ఎస్.ఆర్. నగర్, బంజారాహిల్స్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతో పాటు డీఐజీ కార్యాలయం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయాలు రానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us