ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక మంది మరణాలకు కారణమవుతున్న మహమ్మారులలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్‌లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం
TV9 Telugu
ఈ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సహజమైన పరిష్కారం చుట్టూ ప్రకృతిలో పెరిగే వేప చెట్టులో దాగి ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
వేపచెట్టులో ఉండే గెడునిన్ అనే సమ్మేళనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు
TV9 Telugu
ఈ పరిశోధనలో గెడునిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే విధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. వేపను భారత్‌లో శతాబ్దాలుగా చర్మ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తున్నారు
TV9 Telugu
ఆధునిక శాస్త్రం ఇప్పుడు ఈ సంప్రదాయ జ్ఞానాన్ని మరింతగా అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా సోనిక్ హెజ్‌హాగ్ సిగ్నలింగ్ మార్గం క్యాన్సర్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించే వ్యవస్థపై గెడునిన్ ప్రభావం చూపుతుందని వెల్లడించారు
TV9 Telugu
ఈ పరిశోధన ప్రకారం గెడునిన్ క్యాన్సర్ కణాల పెరుగుదల మార్గాలను లక్ష్యంగా చేసుకుని వాటిని అడ్డుకుంటుంది. అలాగే ట్యూమర్ ఇతర భాగాలకు వ్యాపించే ప్రక్రియను తగ్గించే సామర్థ్యం కలిగి ఉండొచ్చని సూచిస్తున్నారు
TV9 Telugu
మరింతగా ఇది అపోప్టోసిస్ అనే సహజ కణ మరణ ప్రక్రియను ప్రోత్సహించి, హానికర కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, సంప్రదాయ కీమోథెరపీతో పోలిస్తే తక్కువ దుష్ప్రభావాలు ఉండే అవకాశముందని తెలిపారు
TV9 Telugu
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స చాలా క్లిష్టమైనది. ఇది వేగంగా వ్యాపించడంతోపాటు ప్రారంభ దశలో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల కొత్త చికిత్సా మార్గాల కోసం ప్రపంచవ్యాప్తంగా శోధనలు కొనసాగుతున్నాయి