లివర్‌ను కడిగిన ముత్యంలా.. తళతళలాడించే పవర్ ఫుల్ డ్రింక్‌ ఇది

29 April 2026

TV9 Telugu

TV9 Telugu

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నేడు ప్రతి ముగ్గురిలో ఒరికి ఉంటుంది. బయటకు సన్నగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడం దీని ప్రధాన లక్షణం

TV9 Telugu

అధిక కార్బొహైడ్రేట్లు, కూర్చునే జీవనశైలి, ఒత్తిడి.. ఇవన్నీ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితిలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యమవుతాయి

TV9 Telugu

లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారాల్లో ఉసిరి  రసం ముఖ్యమైనది. ఉసిరి రసం లివర్ ఆరోగ్యానికి బలమైన సహాయకారిగా ప‌నిచేస్తుంది

TV9 Telugu

ఇది విటమిన్ సి ని సమృద్ధిగా క‌లిగి ఉంటుంది. నారింజ కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఆ విట‌మిన్ ఉంటుంది. అలాగే టానిన్స్ వంటి ప్రత్యేక స‌మ్మేళ‌నాలు లివర్‌లో హానికర పదార్థాలు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఉసిరి ఎక్స్‌ట్రాక్ట్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసం వల్ల లిపిడ్ నియంత్రణ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి లివర్ కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. అందుబాటులో సులభంగా లభించటం వల్ల దీన్ని దీర్ఘకాలిక అలవాటుగా మార్చుకోవచ్చు

TV9 Telugu

ఉసిరి రసం ఫ్యాటీ లివర్ నియంత్రణలో ఎక్కువగా ప్రభావవంతమని పరిశోధనలు సైతం సూచిస్తున్నాయి. ముఖ్యంగా లివర్‌లో కొవ్వు తగ్గించడంలో ఇది కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది

TV9 Telugu

అయితే మరింత సమగ్ర ప్రయోజనం కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఉదయం ఖాళీ కడుపుతో 15 మిల్లీలీటర్ల ఉసిరి రసం, 15 మిల్లీలీటర్ల గోధుమ గడ్డి రసం కలిపి గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు