AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??

Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??

Phani CH
|

Updated on: Feb 21, 2026 | 10:59 AM

Share

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతంలో గోలీ సోడా ఆదరణ అద్భుతం. ఆధునిక శీతల పానీయాలున్నా, సింగరేణి కార్మికులకు ఇది అజీర్తి, కడుపు ఉబ్బరానికి ఔషధం. చిటికెడు ఉప్పు, నిమ్మరసంతో కూడిన గోలీ సోడా వారికి విశ్రాంతినిస్తుంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత సంస్కృతిలో అంతర్భాగంగా నిలిచి, వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరబ్బా అనేది ఓ సినిమా డైలాగ్.. కానీ, గోలీ సోడా తాగితే వచ్చే కిక్కే వేరబ్బా అనేది కోల్ బెల్ట్ ప్రాంత ప్రజల రియల్ డైలాగ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనితో పాటు బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో గోలీ సోడాకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆధునిక కాలంలో రంగురంగుల సాఫ్ట్ డ్రింక్స్ ఎన్ని వచ్చినా, ఇక్కడి ప్రజల మనసు మాత్రం ఆ ‘గోలీ’ సోడా దగ్గరే ఆగిపోతుంది. పారిశ్రామిక ప్రాంతమైన సింగరేణిలో వాతావరణ కాలుష్యం సహజం. గంటల తరబడి భూగర్భ గనుల్లో శ్రమించే కార్మికులు అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో వైద్యులు ఇచ్చే టాబ్లెట్స్ కంటే, చిటికెడు ఉప్పు, నిమ్మరసం కలిపిన ‘గోలీ సోడా’నే తమకు సరైన మందని ఇక్కడి కార్మికులు నమ్ముతారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఒక్క సోడా కొడితే వచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేమని వారు మురిసిపోతుంటారు. సాధారణంగా బయట ప్రాంతాల్లో గోలీ సోడాలు కనుమరుగవుతున్నా, కోల్ బెల్ట్ ఏరియాలో మాత్రం వీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు ఎన్ని అందుబాటులో ఉన్నా.. గోలీ సోడా ఇచ్చే ఆ ‘సౌండ్’, ఆ ‘కిక్’ ముందు ఏవీ సాటిరావని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా, ఈ ప్రాంత సంస్కృతిలో గోలీ సోడా ఒక అంతర్భాగంగా మిగిలిపోవడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

Follow Us