AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌..  సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

Phani CH
|

Updated on: Feb 21, 2026 | 9:45 AM

Share

మంగళగిరిలో టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు క్షణికావేశంలో భార్య క్రాంతి తన భర్త అహ్మద్‌ను కత్తితో పొడిచి చంపిన దారుణం కలకలం రేపింది. ఎనిమిది నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట జీవితం చిన్న వాగ్వాదంతో రక్తపాతంతో ముగిసింది. అనురాగంతో మొదలైన బంధం ఇలా దురంతంగా మారడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అతి చిన్న కారణాలు.. క్షణికావేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఏకంగా భర్తనే కత్తితో పొడిచి చంపిన భార్య ఉదంతం మంగళగిరి మండలంలో కలకలం రేపింది. సహజీవనం చేసి, పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే ఈ బంధం రక్తపాతంతో ముగిసింది. గుంటూరు పెద వడ్లపూడికి చెందిన అహ్మద్ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరికి చెందిన క్రాంతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నారు. రంజాన్ మాసం కావడంతో అహ్మద్ ఉపవాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 19న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అహ్మద్, భార్య క్రాంతి చూస్తున్న టీవీ సౌండ్ ఎక్కువగా ఉండటంతో తగ్గించమని కోరాడు. ఈ చిన్న మాట కాస్తా ఇద్దరి మధ్యవాగ్వాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య క్రాంతి, వంటగదిలోకి వెళ్లి కత్తిని తీసుకువచ్చి అహ్మద్ పొట్టలో బలంగా పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, లివర్ దెబ్బతినడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. అనురాగంతో మొదలైన వీరి ప్రయాణం, క్షణికావేశంలో హత్యాచారంగా ముగియడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల..

దారుణం.. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిపై..

ముగిసిన ఆపరేషన్‌ టైగర్‌.. సురక్షితంగా అడవిలోకి బెబ్బులి

టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్‌ నేత

ఈ వీకెండ్‌లోనే.. ఇరాన్‌పై అమెరికా దాడులు !!

Follow Us