AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: 2 ఓవర్లు 29 పరుగులు.. కట్‌చేస్తే.. టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..

Super 8 India vs South Africa: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌గా సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయలేకపోయింది. కొన్ని మ్యాచ్‌ల్లో ఒక్క ఆటగాడు రాణించగా, మరో గేమ్ లో ఇంకో ఆటగాడు రాణించాడు. కానీ, మొత్తం బ్యాటింగ్ లైనప్ కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయింది. సూపర్-8 దశలో సౌతాఫ్రికా ఈ బలహీనతను మరింతగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

IND vs SA: 2 ఓవర్లు 29 పరుగులు.. కట్‌చేస్తే.. టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..
Ind Vs Sa 2nd T20i Records
Venkata Chari
|

Updated on: Feb 21, 2026 | 11:19 AM

Share

Super 8 India vs South Africa: సూపర్-8 రౌండ్‌లో టీమిండియా తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో జరగనుంది. రెండు సంవత్సరాల క్రితం ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఈసారి ప్రతీకారం తీర్చుకునే ఉత్సాహంలో ఉంది. అప్పట్లోనూ భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ప్రోటీస్ జట్టు, ఈసారి కూడా సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ భారత్‌కు ప్రధాన ముప్పుగా మారవచ్చు.

టీమిండియాలో బయటపడిన బలహీనత..

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని ప్రస్తుత భారత టీ20 జట్టును అత్యంత బలమైన జట్టుగా భావిస్తున్నారు. కానీ ఈ టోర్నీలో బ్యాటింగ్ పరంగా ఇంకా పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని చూపలేకపోయింది. ముఖ్యంగా ఒకేసారి అందరూ కలిసి రాణించడంలో విఫలమవుతోంది.

ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆఫ్ స్పిన్ బౌలింగ్. గెర్హార్డ్ ఎరాస్మస్, ఆగా సల్మాన్, సామ్ అయూబ్, ఉస్మాన్ తారిక్, ఆర్యన్ దత్ వంటి ఆఫ్ స్పిన్నర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ స్పిన్‌కు ఎదురుగా కష్టపడిన సందర్భాలు కనిపించాయి. వీరు కేవలం పరుగుల వేగాన్ని తగ్గించడమే కాకుండా కీలక వికెట్లను కూడా కోల్పోయారు.

కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేసినా మార్క్రమ్ ఎందుకు ముప్పు..?

ఈ టోర్నీలో మార్క్రమ్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో కేవలం 2 ఓవర్లే బౌలింగ్ చేశారు. ఈ రెండు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అయినప్పటికీ, భారత జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో ఆఫ్ స్పిన్నర్ అయిన మార్క్రమ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు పవర్‌ప్లేలో పరుగుల వేగాన్ని తగ్గించడంలో మార్క్రమ్ విజయం సాధిస్తే, అది టీమ్ ఇండియాకు పెద్ద సమస్యగా మారవచ్చు. అనుభవం ఉన్న కెప్టెన్‌గా మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ మార్పులు చేస్తూ భారత బ్యాటింగ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాడు. అందుకే, తక్కువ ఓవర్లు వేసినా సూపర్-8 మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రమ్ భారత్‌కు కీలక ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us