- Telugu News Photo Gallery Cricket photos Top 5 bowlers can perform brilliantly in asia cup 2022 Bhuvneshwar Kumar
Asia Cup 2022: ఈ 5గురి పైనే అందరి దృష్టి.. లిస్టులో భారత స్టార్ ప్లేయర్..
ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ భారత జట్టులో లేకపోవడం అలాగే షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ జట్టులో భాగం కావడం లేదు.
Updated on: Aug 26, 2022 | 12:46 PM

ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ భారత జట్టులో లేకపోవడం అలాగే షాహీన్ అఫ్రిది పాకిస్థాన్ జట్టులో భాగం కావడం లేదు. ఆసియా కప్ 2022లో ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అభిమానుల దృష్టిలో ఉండే టాప్ 5గురు బౌలర్లను చూద్దాం..

దుష్మంత చమీర (శ్రీలంక): చమీరా 50 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 30.27 సగటు, 8.14 ఎకానమీతో 48 వికెట్లు తీశాడు.

భువనేశ్వర్ కుమార్ (భారతదేశం): భువీ 72 టీ20 మ్యాచ్‌ల్లో 23.44 సగటు, 6.93 ఎకానమీతో 73 వికెట్లు తీశాడు.

ముస్తాఫికర్ రెహమాన్ (బంగ్లాదేశ్): రెహమాన్ 69 టీ20 మ్యాచ్‌ల్లో 20.62 సగటు, 7.7 ఎకానమీతో 91 వికెట్లు తీశాడు.

నసీమ్ షా (పాకిస్థాన్): 19 ఏళ్ల పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షాకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇంకా అవకాశం రాలేదు. 13 టెస్టు మ్యాచ్‌ల్లో 36.3 సగటు, 61.73 స్ట్రైక్ రేట్‌తో 33 వికెట్లు తీశాడు.

నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్థాన్): నవీన్-ఉల్-హక్ 18 అంతర్జాతీయ టీ20ల్లో 18.04 సగటు, 7.94 ఎకానమీతో 25 వికెట్లు తీశాడు.





























