- Telugu News Photo Gallery Cricket photos Asia cup 2022: team india star player virat kohli shares post on ms dhoni emotional instagram twitter post before india vs pakistan match
Virat Kohli: 7+18 భాగస్వామ్యాలు ఎప్పటికీ ప్రత్యేకమే.. ఆసక్తిరేపుతోన్న కోహ్లీ పోస్ట్.. అర్థమేంటో తెలుసా?
ASIA CUP 2022: టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగస్ట్ 25 గురువారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాలో మాజీ భారత వికెట్ కీపర్, లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అతనికి ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చాడు.
Updated on: Aug 26, 2022 | 11:19 AM

ASIA CUP 2022: బ్యాట్ నుంచి పరుగులు వస్తున్నా.. రాకపోయినా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి చర్చనీయాంశంగా నిలుస్తున్నాడు. ఆసియా కప్ 2022తో నెల రోజుల తర్వాత తిరిగి మైదానంలోకి ఈ భారత స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా లేదా అనే ఉత్సుకత మరింత పెరిగింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు. వీటన్నింటి మధ్యలో కోహ్లి హఠాత్తుగా ఒక పోస్ట్‌ను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే సమయంలో కొద్దిగా భావోద్వేగానికి కూడా గురి చేశాడు.

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగస్ట్ 25 గురువారం రాత్రి తన సోషల్ మీడియా ఖాతాలో మాజీ భారత వికెట్ కీపర్, లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అతనికి ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చాడు. ఇది అభిమానులను షాక్‌తోపాటు భావోద్వేగానికి కూడా గురి చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2016 నాటి మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ, "ఈ వ్యక్తి విశ్వాసాన్ని పొందడం.. నా కెరీర్‌లోనే అత్యంత కీలకమైన దశ. మా భాగస్వామ్యాలు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రత్యేకమైనవి. 7+18" అంటూ టైటిల్ ఇచ్చాడు.

కోహ్లి హఠాత్తుగా అలాంటి ఫొటోను ఎందుకు పోస్ట్ చేశాడోనని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంత భావోద్వేగ క్యాప్షన్‌ను ఎందుకు పోస్ట్ చేశాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు కోహ్లీ మనసులో లేదా హృదయంలో ఏముందో తెలుసుకుందాం.

అయితే, ఆ పోస్ట్‌లో 7, 18 అంకెలు ఏంటో అర్థం కాక సతమతమతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధోని ధరించిన జెర్సీ నంబర్ 7 కాగా, కోహ్లీ ధరించే జెర్సీపైన 18 నంబర్ ఉంటుంది. అలాగే ఈ రెండింటిని కలిపితే 25 నంబర్ వస్తుంది. ఈ క్రమంలో 25వ తేదిన ధోనిని గుర్తుచేసుకున్నాడు.

అలాగే 2012 ఆసియాకప్‌లోనే తొలిసారిగా ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాతే కోహ్లి మూడు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత ధోనీ తర్వాత 2015లో టెస్టు జట్టుకు, 2017 నుంచి వన్డే-టీ20కి కెప్టెన్సీని అందుకున్నాడు.




