- Telugu News Photo Gallery Cricket photos Team india player virat kohli palying 100 match vs pak in asia cup 2022 telugu cricket news
Virat Kohli vs PAK: విరాట్ కోహ్లీ కెరీర్‌లో బిగ్ మ్యాచ్.. పాక్‌పై బరిలోకి దిగితే రికార్డుల వర్షమే..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇదో పెద్ద మ్యాచ్‌గా మారనుంది. ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టగానే కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.
Updated on: Aug 28, 2022 | 8:46 AM

Virat Kohli 100th T20 Match: ఆసియా కప్ 2022లో భారత క్రికెట్ జట్టు ఆదివారం (ఆగస్టు 28) తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో మొదటి మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇదో పెద్ద మ్యాచ్‌గా మారనుంది. ఈ మ్యాచ్‌లో అడుగుపెట్టగానే కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

భారత మాజీ కెప్టెన్ కోహ్లి చాలా కాలంగా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. అతని బ్యాట్ పరుగులు చేయడంలో దారుణంగా విఫలమవుతూనే ఉంది. కానీ, ఈ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు చేసేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు.

నిజానికి ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లి పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడితే అతడి కెరీర్‌లో ఇది 100వ టీ20 మ్యాచ్ అవుతుంది. తద్వారా భారత్ నుంచి 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.

ఈ విషయంలో రోహిత్ శర్మ అతని కంటే ముందున్నాడు. ప్రపంచంలో అత్యధికంగా 132 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా భారత కెప్టెన్ రోహిత్ నిలాచాడు. కోహ్లీ తర్వాత రోహిత్‌కి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

దీనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) 100 మ్యాచ్‌లు ఆడిన ఆసియాలో మొదటి, ప్రపంచంలో రెండవ క్రికెటర్‌గా కూడా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 262 వన్డేలు, 102 టెస్టు మ్యాచ్‌లతోపాటు 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) 100 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలో రెండో ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ పేరిట ఉంది. టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

41 రోజుల విరామం తర్వాత కోహ్లీ నేరుగా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. అతను ఈ ఏడాది జులై 17న మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. కోహ్లీ గత ఐదు నెలలుగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ, రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేదు.




