AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: వాషింగ్ మెషీన్‌లో లిక్విడ్ లేదా సర్ఫ్ ఎంత వేయాలో తెలుసా..? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..

ప్రస్తుత కాలంలో అందరి ఇళ్లలో వాషింగ్ మెషీన్ కామన్‌గా మారింది. అయితే చాలామందికి ఒక అపోహ ఉంటుంది.. బట్టలు ఉతికేటప్పుడు ఎంత ఎక్కువ డిటర్జెంట్ లేదా సర్ఫ్ వాడితే, అంత ఎక్కువ నురుగు వస్తుందని, దానివల్ల బట్టలు అంత బాగా శుభ్రపడతాయని భావిస్తారు. అయితే ఈ అతి తెలివితేటలే మీ బట్టలను, వాషింగ్ మెషీన్‌ను, చివరకు మీ చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల కలిగే నష్టాలేంటో, అసలు సరైన మోతాదు ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Feb 21, 2026 | 1:09 PM

Share
డిటర్జెంట్ అవసరానికి మించి వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. బట్టలను సరిగ్గా ఆరవేసినా లేదా ఉతికినా.. అధిక డిటర్జెంట్ అవశేషాలు బట్టల పోగుల మధ్య ఉండిపోతాయి. ఇవి చర్మంతో తాకినప్పుడు దురద, చికాకు, అలెర్జీలు, దద్దుర్లకు దారితీస్తాయి.

1 / 5
ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల బట్టల రంగు త్వరగా వెలిసిపోవడమే కాకుండా అవి గరుకుగా మారుతాయి. మెషీన్ లోపల మురికి, డిటర్జెంట్ అవశేషాలు పేరుకుపోయి బూజు పడుతుంది. ఇది మెషీన్ వైఫల్యానికి దారితీసి త్వరగా పాడయ్యేలా చేస్తుంది.

2 / 5
చాలామందికి ఎంత సర్ఫ్ వేయాలో తెలియక అంచనాగా వేస్తుంటారు. మీ వాషింగ్ మెషీన్‌లో సగం వరకు బట్టలు ఉంటే.. కేవలం 2 టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పొడి లేదా 30 నుండి 60 ml లిక్విడ్ డిటర్జెంట్ సరిపోతుంది. బట్టలు బాగా మురికిగా ఉన్నప్పుడు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పొడి లేదా 90 ml లిక్విడ్ వాడవచ్చు. బట్టలు ఉతికిన తర్వాత కూడా డిటర్జెంట్ వాసన వస్తుంటే.. మీరు మోతాదును మరో 20-25 శాతం తగ్గించాలని అర్థం.

3 / 5
నీటి నాణ్యతను బట్టి మారే లెక్కలు: మీరు నివసించే ప్రాంతంలో నీరు హార్డ్ వాటర్ అయితే డిటర్జెంట్ కొంచెం ఎక్కువ అవసరం కావచ్చు. అదే మృదువైన నీరు అయితే తక్కువ డిటర్జెంట్ సరిపోతుంది.

4 / 5
నురుగు ఎక్కువగా వస్తేనే బట్టలు తెల్లగా వస్తాయనేది పాతకాలపు ఆలోచన. నేటి ఆధునిక డిటర్జెంట్లు తక్కువ నురుగుతోనే మొండి మరకలను తొలగించేలా తయారవుతున్నాయి. కాబట్టి మోతాదును గమనించి వాడటం వల్ల అటు డబ్బు, ఇటు ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.

5 / 5
Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!

యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి