AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అలర్ట్! హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. చంచల్‌గూడ జైల్లో ప్లాన్..

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం అందడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైల్లో ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్ర జరిగిందన్న నిఘావర్గాలు.. లష్కరే తోయిబా ఉగ్రవాది జైల్లో కుట్ర చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

Hyderabad: అలర్ట్! హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. చంచల్‌గూడ జైల్లో ప్లాన్..
Terror Links
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2026 | 1:20 PM

Share

హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం అందడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైల్లో ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్ర జరిగిందన్న నిఘావర్గాలు.. లష్కరే తోయిబా ఉగ్రవాది జైల్లో కుట్ర చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ములాఖత్‌లో ఉగ్రదాడులపై చర్చించినట్టు సమాచారం.. వరుస పేలుళ్ల కుట్రకేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒక ఉగ్రవాది భార్య ద్వారా.. ఉగ్రకుట్రపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.. ఈ పరిణామాలతో ముసారాంబాగ్‌, సైదాబాద్‌, మలక్‌పేట్‌లో పోలీసుల నిఘా ఉంచారు. అంతేకాకుండా.. పోలీసు యంత్రాంగం హైదరాబాద్ నగరం వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్ర లింకులపై పూర్తి సమచారం పసిగట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఢిల్లీలో అలర్ట్..

అయితే.. గత ఏడాది నవంబర్‌ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుళ్లు రిపీట్‌ అవుతాయా? ఉగ్రవాదులు మళ్లీ స్కెచ్‌ గీస్తున్నారంటూ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ చెప్పడం కలకలం రేపింది.. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో మళ్లీ హైఅలర్ట్‌ ప్రకటించారు.. ఉగ్రదాడి జరగొచ్చన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో భద్రతను ఒక్కసారిగా పెంచారు. ఎర్రకోట దగ్గర లష్కరే తోయబా పేలుడుకు పాల్పడవచ్చని అలర్ట్‌ చేసింది ఇంటెలిజెన్స్‌.. ఎర్రకోటతోపాటు చాందినీచౌక్‌లోని ఓ ఆలయం దగ్గర IED పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల దగ్గర కూడా పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేసినట్లు ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఈనెల 6న ఇస్లామాబాద్‌లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగా ఢిల్లీకి ఉగ్రదాడికి ప్లాన్‌ చేశారని అలర్ట్‌చేసింది. ఇంటెలిజెన్స్‌ వార్నింగ్‌లతో అప్రమత్తమైన భద్రతావర్గాలు.. ఢిల్లీలోని VVIP ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టంచేశారు

కాగా, గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో 15మంది మరణించగా.. 20మంది గాయపడిన విషయం తెలిసిందే.. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.. ఈ క్రమంలోనే.. మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొంటుండటం కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!