సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం
సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో పులి సంచారం స్థానికులను భయపెడుతోంది. నాలుగు పశువులపై దాడి చేయడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అప్రమత్తమై, పులిని పట్టుకోవడానికి హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించింది. ఒంటరిగా పొలాలకు, రాత్రి వేళల్లో గ్రామ శివారుల్లో వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా గ్రామ శివారుల్లో తిరుగుతున్న పులి, ఇప్పటికే నాలుగు పశువులపై దాడి చేసి చంపేయడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావడానికి గ్రామస్తులు వణికిపోతున్నారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకుని, అడవిలోకి పంపేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంత సరిహద్దుల్లో నిఘా పెంచిన అధికారులు, పులి అడుగుజాడలను గుర్తిస్తున్నారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో గ్రామ శివారుల్లో సంచరించవద్దని హెచ్చరించారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ ‘పులి’ భయం ఎప్పుడు వీడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్ అందిస్తారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

