Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రం నుండి సంచలన వార్తలు! ఈ మూవీలో 25 నిమిషాల త్రేతాయుగ ఎపిసోడ్ కోసం ఏకంగా ₹300 కోట్లు ఖర్చు చేస్తున్నారట. భారీ సెట్లు, వరల్డ్ క్లాస్ VFX తో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరచనుంది. అంతేకాకుండా, మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని 'యానిమల్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు సినీ అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీలో చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వారణాసిలో త్రేతాయుగ ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. దాదాపు 25 నిమిషాల నిడివి ఉండే ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.300 కోట్లను జక్కన్న ఖర్చు పెట్టినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇందుకోసం జక్కన్న భారీ సెట్లు, వరల్డ్ క్లాస్ VFX యూజ్ చేస్తున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్ ప్రజెంట్ జక్కన్న డైరెక్షన్లో వారణాసి సినిమాతో బిజీగా ఉన్న మహేష్… తన నెక్స్ట్ సినిమా కోసం యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో జతకట్టబోతున్నట్టుగా సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీని కూడా లాక్ చేసినట్టుగా టాక్. మహేష్‌ను జక్కన్నను రివీల్ చేసే లోపు.. తాను కూడా తన ప్రాజెక్ట్స్‌ను ఫినిష్ చేసి.. మహేష్ కోసం రెడీగా ఉండాలని సందీప్ వంగా ప్లాన్ చేస్తున్నారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mohan Babu: కిడ్నాప్ కేసులో.. మోహన్ బాబుకు బిగ్ షాక్
Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

