Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను పంచుకుంటూ, తన విజయానికి సురేఖ అందించిన అచంచలమైన మద్దతు, కుటుంబానికి ఆమె బలమైన పునాదిగా నిలిచిన తీరును వివరించారు. షూటింగ్‌లలో తాను బిజీగా ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలను మోసి, తల్లిదండ్రులను సొంతవారిలా చూసుకున్న సురేఖకు జీవితాంతం రుణపడి ఉంటానని చిరు పేర్కొన్నారు.
తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు. తన ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది అంటూ తన భార్య సురేఖ గురించి చెప్పుకొచ్చారు మెగాస్టార్. అంతేకాదు తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని నడిపించింది తన భార్యే అంటూ గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా చూసుకుంటూ.. కోడలిగా కంటే ఒక కూతురిలా సురేఖ అందరి మనసు గెలుచుకుందంటూ తన పోస్టులో చిరు రాసుకొచ్చారు. అంతేకాదు తన ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉందని.. తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, తాను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. జీవితాంతం తన భార్య సురేఖకు రుణపడి ఉంటానని తన పోస్టులో కోట్ చేశారు మెగాస్టార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

