AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTTలోకి వచ్చిన మలయాళ సూపర్ హిట్ మూవీ

OTTలోకి వచ్చిన మలయాళ సూపర్ హిట్ మూవీ

Phani CH
|

Updated on: Feb 21, 2026 | 12:25 PM

Share

తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌కు ఆదరణ ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మలయాళ సినిమాలపై ఓటీటీలలో వారికి మక్కువ పెరిగింది. ఇటీవల విడుదలైన 'చథా పచ్చా' మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయినా, తెలుగు థియేటర్లలో ప్రచారం లేక వెనుకబడింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ WWE నేపథ్య చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తూ, మలయాళ చిత్రాల విజయగాథను మరోసారి చాటుతోంది.

కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు మన తెలుగు ఆడియెన్స్. తమిళం, కన్నడ, హిందీ, మలయాళం అని తేడా లేకుండా… ఓటీటీలకు అతుక్కుపోతుంటారు. అందులోనూ కరోన తర్వాత నుంచి మలయాళ సినిమాలపై విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. వచ్చనవి వచ్చనట్టు చూసేస్తున్నారు. ఇక మరో పక్క ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఏదోక మలయాళ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా ఫిబ్రవరి 19న కూడా మలయాళం సూపర్ హిట్ మూవీ చథా పచ్చా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఫిబ్రవరి 13నే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో తెలుగు ఆడియెన్స్ ఈ మూవీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ… నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇక చథా పచ్చ కథ విషయానికి వస్తే… కేరళలోని ఓ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఈ ముగ్గురికి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ WWE అంటే పిచ్చి. ఈ గేమ్ లో రెజ్లర్లు తీవ్రంగా కొట్టుకుంటుంటే ఈ బ్రదర్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలా WWE పై పిచ్చితోనే గ్రామంలో అలాంటి పోటీలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం గ్రామంలో ఒక అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. అక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ రెజ్లింగ్ క్లబ్ వల్ల వీరి జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. చివరకు ఈ అన్మదమ్ములు ఏమయ్యారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం ఉన్న అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. అద్వేత్ నాయర్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ ఎషాన్ లై.. ఈ మూవీకి పాటలు అందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కార్డ్‌తో పాటే.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. VD ఏం ఇస్తున్నారంటే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న

Mohan Babu: కిడ్నాప్ కేసులో.. మోహన్ బాబుకు బిగ్ షాక్

Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి

చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం

Follow Us