Video: 5 సిక్సర్లు, 2 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో అరుదైన వరల్డ్ రికార్డ్.. ఎవరంటే?
Marco Jansen Fastest Fifty T20 World Cup: సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ నమోదైంది. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Marco Jansen Fastest Fifty T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా ( South Africa national cricket team) వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand national cricket team) జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభంలో తడబడినా, మార్కో యాన్సెన్ 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి జట్టును బలమైన స్కోర్‌కు తీసుకెళ్లాడు.
యాన్సెన్ తుఫాన్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు అయిన క్వింటన్ డికాక్ (Quinton de Kock), రియాన్ రికల్టన్ (Ryan Rickelton), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) పెద్దగా రాణించలేకపోయారు.
అయితే అదే పిచ్‌పై మార్కో యాన్సెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును కాపాడాడు. అతను తన ఇన్నింగ్స్‌లో.. 5 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డు..
Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥
Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌
ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth
— Star Sports (@StarSportsIndia) March 4, 2026
మార్కో యాన్సెన్ టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
అయితే ఈ జాబితాలో ప్రత్యేకత ఏమిటంటే.. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వేగంగా అర్ధశతకం చేసిన మొదటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అతనే.
ఈ జాబితాలో ఉన్న ఇతర ప్రముఖ ఆటగాళ్లు:
యువరాజ్ సింగ్ (Yuvraj Singh) – 20 బంతుల్లో (2007, ఆస్ట్రేలియాపై)
మైఖేల్ హస్సీ (Michael Hussey) – 22 బంతుల్లో (2010, పాకిస్తాన్‌పై)
హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) – 23 బంతుల్లో (2024, భారత్‌పై)
జాసన్ రాయ్ (Jason Roy) – 26 బంతుల్లో (2016, న్యూజిలాండ్‌పై)
దక్షిణాఫ్రికాను కాపాడిన యాన్సెన్..
ఒక దశలో దక్షిణాఫ్రికా కేవలం 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో మార్కో యాన్సెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గట్టెక్కించాడు. అతను స్టబ్స్ (Tristan Stubbs) తో కలిసి 48 బంతుల్లో 73 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
స్టబ్స్ 24 బంతుల్లో 29 పరుగులు చేయగా, మరో బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) 34 పరుగులు చేసి జట్టుకు సహకరించాడు. ఈ ఇన్నింగ్స్‌లతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
