IND vs HKG: ధోనీ, కోహ్లీ, పాక్ కెప్టెన్‌ రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్.. హాంకాంగ్‌పై గెలిస్తే అగ్రస్థానానికే..

Venkata Chari

Venkata Chari |

Updated on: Aug 30, 2022 | 2:56 PM

ASIA CUP 2022: భారత్, హాంకాంగ్ మధ్య బుధవారం దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

IND vs HKG: ధోనీ, కోహ్లీ, పాక్ కెప్టెన్‌ రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్.. హాంకాంగ్‌పై గెలిస్తే అగ్రస్థానానికే..
Asia Cup 2022 Rohit Sharma Rahul Dravid

ASIA CUP 2022: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత టీమిండియా రేపు హాంకాంగ్‌‌తో తలపడనుంది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్ విజయం సాధించి తన సత్తాను నిరూపించుకుంది. అయితే బలమైన టీమిండియా ముందు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బ్యాట్స్‌మెన్స్‌ను పరీక్షించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాగా , కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ధోనీని, విరాట్ కోహ్లీని వదిలిపెట్టే ఛాన్స్ ఉంది. అదే సమయంలో రోహిత్ పాక్ ప్లేయర్ మొయిన్ అలీని కూడా పక్కకు నెట్టే అవకాశం ఉంది.

ధోనీ-మొయిన్ ఖాన్‌లను రోహిత్ శర్మ ఓడించేనా?

ఆసియా కప్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఎంఎస్ ధోనీ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ అలీ వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కలిగి ఉన్నారు. రోహిత్ శర్మ కూడా ఆసియా కప్‌లో కెప్టెన్‌గా వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచాడు. హాంకాంగ్‌పై టీమిండియా గెలిస్తే, రోహిత్ వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా నిలుస్తాడు.

రోహిత్ శర్మ టార్గెట్‌లో విరాట్ కూడా!

రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీని ఓడించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ హాంకాంగ్‌పై గెలిస్తే, అతను భారత విజయవంతమైన రెండవ T20 కెప్టెన్ అవుతాడు. విరాట్ కోహ్లీ టీ20లో 30 విజయాలు సాధించాడు. అదే సమయంలో, ధోనీ తన పేరు మీద అత్యధికంగా 41 T20 విజయాలు సాధించాడు. ధోనీ రికార్డు కూడా రోహిత్ టార్గెట్‌పైనే ఉంటుందనడంలో సందేహం లేదు.

టీం ఇండియా మళ్లీ పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది..

టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్టు మరోసారి సమరానికి సిద్ధమవుతున్నాయి. నిజానికి గ్రూప్‌-బిలో పాక్‌ జట్టు హాంకాంగ్‌ను ఒక మ్యాచ్‌లో ఓడిస్తే.. ఆదివారం భారత్‌-పాక్‌ల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో తలపడాలంటే భారత్ హాంకాంగ్‌పై కూడా విజయం సాధించాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu