AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

IPL 2026 Schedule: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయి. మొదటి దశలో 19 మ్యాచ్‌లు జరగనున్నాయి.

IPL 2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?
Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 17, 2026 | 9:48 PM

Share

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి . దానికి ముందు, బీసీసీఐ అన్ని జట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రాక్టీస్ నిర్వహించాలని పేర్కొంది. బీసీసీఐ మార్గదర్శకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా పిచ్‌ల వాడకం: ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్‌లను లేదా నెట్‌లను వాడకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్‌పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.

నెట్‌లను పంచుకోవడంపై నిషేధం: జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్‌లను రెండవ జట్టుకు ఇవ్వరాదు. ఇది ‘రేంజ్ హిట్టింగ్’ పిచ్‌లకు కూడా వర్తిస్తుంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌ల పై పరిమితి: ప్రతి జట్టు గరిష్టంగా 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలదు. దీనికి బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.

కాల పరిమితి: ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లు 3.5 గంటలకు మించకూడదు.

ప్రధాన పిచ్‌ల పరిరక్షణ: ఒక జట్టు మొదటి లోకల్ మ్యాచ్‌కు 4 రోజుల ముందు వరకు ప్రధాన పిచ్ లేదా సెంట్రల్ స్క్వేర్‌లో ఎలాంటి ప్రాక్టీస్ లేదా శిక్షణా మ్యాచ్‌లు నిర్వహించరాదు. ఈ కాలంలో స్వదేశీ జట్టుకు వేరే ప్రాక్టీస్ గ్రౌండ్ అవసరమైతే, రాష్ట్ర క్రికెట్ సంఘాలు దానిని ఉచితంగా అందించాలి.

సమయం, ప్రాధాన్యత: ప్రాక్టీస్ స్లాట్‌లను ఎంపిక చేసేటప్పుడు ఆతిథ్య జట్టుకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ముందు రోజు మ్యాచ్ ఉన్నా లేదా ప్రయాణ ఒత్తిడి ఉన్నా, సందర్శక జట్ల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

బాధ్యతలు: ప్రాక్టీస్ సమయంలో భోజనం, వైద్య సంరక్షణ మరియు, భద్రతకు సంబంధిత హోమ్ టీమ్ పూర్తిగా బాధ్యత వహిస్తుంది.

రేంజ్-హిట్టింగ్ ప్రాక్టీస్: నిర్దేశిత మైదానాల్లో ప్రాక్టీస్ కోసం రెండు నెట్‌లను, ప్రధాన మైదానంలో రేంజ్-హిట్టింగ్‌కు అవకాశం కల్పించాలని బీసీసీఐ అన్ని జట్లను ఆదేశించింది.

ఈ నియమం ఎందుకు?

సమాన అవకాశం: ముందుగా సాధన చేసే జట్టుకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. తర్వాత వచ్చే జట్టుకు అనుకూలంగా ఉండదు. దీనిని నివారించి, రెండు జట్లకు సమాన నాణ్యత గల పిచ్ అందేలా చూడటమే లక్ష్యం.

గాయాల హెచ్చరిక: ఉపయోగించే బంతులు అసమతుల్యంగా ఎగిరిపడవచ్చు. దీనివల్ల బ్యాటర్లకు గాయాలు కావచ్చు.

ఖచ్చితమైన సన్నాహం: మ్యాచ్ రోజున పిచ్ ఎలా ఉంటుందో ఖచ్చితమైన అంచనా వేయడానికి కొత్త పిచ్‌లు అవసరం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us