- Telugu News Photo Gallery Cricket photos Team india former player sachin tendulkar captain india legends road safety series 2022
Sachin Tendulkar: మైదానంలోకి మరోసారి సందడి చేయనున్న మాస్టర్ బ్లాస్టర్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Road Safety World Series: ఈ టోర్నీకి మరోసారి సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మీడియా కథనాల ప్రకారం, చివరిసారిగా ఇండియా లెజెండ్స్ ఛాంపియన్‌గా నిలిపిన సచిన్.. మరోసారి జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాడు.
Updated on: Aug 31, 2022 | 8:24 PM

Road Safety World T20 Series: అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ త్వరలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడబోతున్నాడు. ఈ టోర్నీకి మరోసారి సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మీడియా కథనాల ప్రకారం, చివరిసారిగా ఇండియా లెజెండ్స్ ఛాంపియన్‌గా నిలిపిన సచిన్.. మరోసారి జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాడు.

సచిన్ కెప్టెన్సీలో భారత్ తొలి రోడ్ సేఫ్టీ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇండియా లెజెండ్స్ 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌పై విజయం సాధించింది. ఫైనల్‌లో యువరాజ్‌సింగ్, యూసుఫ్ పఠాన్ హాఫ్ సెంచరీలతో భారత్ లెజెండ్స్‌కు విజయాన్ని అందించారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మ్యాచ్‌లు లక్నో, జోధ్‌పూర్, కటక్, హైదరాబాద్‌లలో జరగనున్నాయి. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న లక్నోలో జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 2న హైదరాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

లక్నోలో 7 మ్యాచ్‌లు జరుగుతాయి. దీని తర్వాత జోధ్‌పూర్‌లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. కటక్‌లో 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ చివరి మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. లక్నో, కటక్‌లలో డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. జోధ్‌పూర్‌లో 2 డబుల్ హెడర్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్‌తో పాటు ఇంకా చాలా మంది మాజీ భారతీయులు ఆడుతున్నారు. ఇందులో ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.





























