AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెస్టారెంట్‌లో లవ్‌ ప్రపోజల్‌.. అమ్మాయి రిజెక్ట్‌ చేయడంతో అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు

ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో అందమైనది. దాని అనుభూతి అంతకంటే అద్భుతమైనది. ప్రేమకు వయస్సు, జాతి, మతం, కులం, ప్రాంతం.. ఇలా ఎలాంటి హద్దులు లేవు.

Viral Video: రెస్టారెంట్‌లో లవ్‌ ప్రపోజల్‌.. అమ్మాయి రిజెక్ట్‌ చేయడంతో అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు
Love Proposal
Basha Shek
|

Updated on: Sep 03, 2022 | 9:49 PM

Share

ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో అందమైనది. దాని అనుభూతి అంతకంటే అద్భుతమైనది. ప్రేమకు వయస్సు, జాతి, మతం, కులం, ప్రాంతం.. ఇలా ఎలాంటి హద్దులు లేవు. అయితే ఈ పవిత్రమైన ప్రేమ ఈరోజల్లో టైమ్‌పాస్‌గా మారింది. అమ్మాయిలు, అబ్బాయిల్లో కొందరు 15-16 ఏళ్ల లోపే ప్రేమలో పడిపోతున్నారు. అంతేకాదు అవతలివాళ్లు తమ ప్రేమను స్వీకరించనప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలకు, భావోద్వేగాలకు లోనవుతున్నారు. కొందరైతే లవ్‌లో ఫెయిల్‌ అయ్యామంటూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో లవ్‌ ప్రపోజల్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితురాలిని రెస్టారెంట్‌కి తీసుకెళతాడు. రుచికరమైన ఫుడ్స్‌ను ఆర్డర్‌ చేస్తాడు.

తన ప్రేమను తెలియజేసేందుకు ఇదే మంచి సందర్భమనుకుంటూ వెంటనే మోకాళ్లపై కూర్చొని పెళ్లి ప్రపోజ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ తన ప్రపోజల్‌కు ఓకే చెబుతుందని అతను ఆశపడతాడు. అయితే అలాంటి దేమీ జరగదు. అమ్మాయి అసలేమీ మాట్లాడకపోవడంతో అతని ఆశలు అడియాసలవుతాయి. దీంతో కోపం పట్టలేని బాయ్‌ఫ్రెండ్‌ ప్రియురాలి షూస్‌, సాక్స్‌లను విప్పి తీసుకుంటాడు. అంతేకాకుండా ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను కూడా పాలిథిన్‌ కవర్లలో నింపుకుంటాడు. చివరకు వాటర్‌ బాటిల్‌ను సైతం అక్కడి నుంచి తీసుకెళతాడు. @Unexpectedendd అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేయగా మిలియన్ల మంది వీక్షించారు. లక్షలాది లైకులు వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. అబ్బాయి చేసింది కరెక్టే.. పేదవాడి ఆహారం వృథా అయింది అంటూ అబ్బాయి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమ్మాయిలకు తమకు నచ్చినట్లు జీవించే హక్కు ఉందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

లవ్ ప్రపోజల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా..
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలా..
మీ ఇంట్లో దోమలు, బొద్దింకలు ఉన్నాయా? ఇలా చేస్తే వెంటనే పరార్‌..
మీ ఇంట్లో దోమలు, బొద్దింకలు ఉన్నాయా? ఇలా చేస్తే వెంటనే పరార్‌..
చిన్న ముంబాయిలో రెచ్చిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారులు..
చిన్న ముంబాయిలో రెచ్చిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారులు..
సొరకాయ జ్యూస్ తాగుతున్నారా? ఈ చేదు నిజం తెలుసుకోండి
సొరకాయ జ్యూస్ తాగుతున్నారా? ఈ చేదు నిజం తెలుసుకోండి
బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. వీడియో
బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. వీడియో
కనకాంబరం పూలు కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే..!
కనకాంబరం పూలు కోయాలంటే నిచ్చెన వేయాల్సిందే..!
LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
LLB పూర్తి చేసి రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షలు
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
మేరా భారత్ మహాన్.. సముద్ర లోతుల్లో ఇస్రో సాహస ప్రయోగం..
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన