Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikranth Rona: విక్రాంత్‌ రోణ తెలుగు వెర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Vikrant Rona Telugu OTT Release: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ( Kiccha Sudeep) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez) సుదీప్‌ సరసన ఆడిపాడింది.

Vikranth Rona: విక్రాంత్‌ రోణ తెలుగు వెర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Vikrant Rona
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2022 | 8:00 PM

Vikrant Rona Telugu OTT Release: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ( Kiccha Sudeep) హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez) సుదీప్‌ సరసన ఆడిపాడింది. జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.ఇక ఈ సినిమాలో మంగ్లీ పాడిన రక్కమ్మ సాంగ్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సిల్వర్‌స్ర్కీన్‌పై అలరించిన ఈ ఇంటెన్సివ్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌ ఇప్పుడు డిజిటల్‌ మీడియంలోనూ ప్రసారమవుతోంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈరోజు (సెప్టెంబర్‌ 2న) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే కేవలం కన్నడ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే విక్రాంత్‌ రోణ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్‌ 16 నుంచి తెలుగు వెర్షన్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. కాగా అనూప్‌ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్‌ గౌడ్‌ నిర్మాతగా వ్యవహరించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హీరో హీరోయిన్లతో పాటు నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, రవిశంకర్‌ గౌడ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి బిగ్‌ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు, ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆస్వాదించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్