Katrina Kaif: అందుకే మేం రహస్యంగా పెళ్లి చేసుకున్నాం.. అసలు విషయం చెప్పేసిన మల్లీశ్వరి

Katrina Kaif- Vicky Kaushal: తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ గతేడాది డిసెంబర్‌లో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Katrina Kaif: అందుకే మేం రహస్యంగా పెళ్లి చేసుకున్నాం.. అసలు విషయం చెప్పేసిన మల్లీశ్వరి
Katrina Kaif
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 11:32 AM

Katrina Kaif- Vicky Kaushal: తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకుంటూ గతేడాది డిసెంబర్‌లో గ్రాండ్‌గా పెళ్లిపీటలెక్కారు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ సిక్స్ సెన్సెస్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు వీరి వెడ్డింగ్‌కు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మెడలో మూడుముళ్లు పడేవరకు తన వివాహాన్ని గోప్యంగానే ఉంచింది. విక్కీ కూడా ఎక్కడా తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాతే సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను కత్రినా షేర్ చేసింది. అధికారికంగా విక్కీతో ఏడడుగులు నడిచానంటూ అభిమానులకు తెలిపింది. ఇలా రహస్యంగా తమ పెళ్లి జరగడానికి గల కారణాన్ని తాజాగా బయటపెట్టింది క్యాట్. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కత్రినా హాజరైంది. సర్ధార్ ఉదమ్ సింగ్ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విభాగంలో అవార్డు అందుకున్నాడు విక్కీ . ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కొవిడ్‌ కారణంగానే.. ‘మేము మా పెళ్లిని గోప్యంగా ఉంచడానికి ప్రధాన కారణం కొవిడ్‌. అప్పటి పరిస్థితుల వల్ల అలా రహస్యంగా పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యుల్లో చాలామంది కరనా వల్ల ఇబ్బంది పడ్డారు. అలాంటిది మా వల్ల మరొకరికి ఈ మహమ్మారి సోకకూడదనే ఉద్దేశంతోనే సీక్రెట్‌గా పెల్లి చేసుకున్నాం. అయితే మా వివాహం మాత్రం చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగిందని భావిస్తున్నాను. మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఫీలయ్యాం’ అని చెప్పుకోచ్చింది కత్రినా. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తోంది క్యాట్‌. అలాగే సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ఫోన్ భూత్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. వీటితో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి సరసన మెర్రీ క్రిస్మస్, ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో జీ లే జరా అనే చిత్రాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..