Irfan Pathan: పవర్‌స్టార్ స్టైల్ అంటే ఇష్టం.. పుష్పలో బన్నీ నటన అదుర్స్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్
Cobra Movie: ఇర్ఫాన్ పఠాన్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. స్వింగ్ బౌలింగ్‌తో సంచలనాలు నమోదు చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడీ క్రికెటర్.
Cobra Movie: ఇర్ఫాన్ పఠాన్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. స్వింగ్ బౌలింగ్‌తో సంచలనాలు నమోదు చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడీ క్రికెటర్. ఇప్పుడు సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చి నయా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కిన కోబ్రా (Cobra) సినిమాలో అతను ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నటించాడు. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇదిలా ఉంటే కోబ్రా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఇర్ఫాన్. ముఖ్యంగా టాలీవుడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టమని ఇర్ఫాన్‌ను ప్రశ్నించగా పలు సినీ తారల పేర్లు చెప్పుకొచ్చాడు. ఇక టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమట. అదేవిధంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అదిరిపోయిందన్నాడు. కంటెంట్ బాగున్న దక్షిణాది సినిమాలను తాను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కంటెంట్ ఎక్జయిటింగ్‌గా ఉండే దక్షిణాది సినిమాలను తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. కాగా యాక్షన్ థ్రిల్లర్‌గా కోబ్రా చిత్రంలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్ కీలక పాత్రల్లో నటించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.