- Telugu News Photo Gallery US Open 2022: Serena Williams special outfit for her probably last tournament
Serena Williams: 400 వజ్రాలతో పొదిగిన షూస్, స్పెషల్ స్కర్ట్.. ఆఖరి టోర్నీలో స్పెషల్ అట్రాక్షన్‌గా సెరెనా స్టైల్
US Open 2022: ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి గ్రేట్ సెరెనా విలియమ్స్‌పైనే ఉంది. త్వరలోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సెరెనా మ్యాచ్ కోసం భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు.
Updated on: Aug 30, 2022 | 11:17 PM

US Open 2022: ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి గ్రేట్ సెరెనా విలియమ్స్‌పైనే ఉంది. త్వరలోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సెరెనా.. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6-3, 6-3తో మాంటెనెగ్రోకు చెందిన 80వ ర్యాంకర్ డాంకా కొవినిక్‌పై ఘన విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్‌లో సెరెనా ఆట కంటే ఆమె వేషధారణే ఎక్కువగా చర్చనీయాంశమైంది. నైక్ డిజైనింగ్ టీమ్‌తో కలిసి డిజైన్ చేసిన స్పెషల్ లుక్‌లో కోర్టులో సెరానా సందడి చేసింది. ఈ లుక్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంగా స్టార్స్ తో కూడిన బ్లాక్ బాడీకాన్ దుస్తులను ధరించింది. మిలమిలమంటూ మెరిసే డ్రెస్‌పై ఆమె ఆరు US ఓపెన్ టైటిళ్లను చూపుతుంది. ఇక డ్రెస్‌తో పాటు మ్యాచ్ ప్రారంభంలో ధరించిన జాకెట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక సెరెనా బూట్లు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే 400 వజ్రాలతో ఈ షూస్‌ను స్పెషల్గా డిజైన్ చేశారు. వీటి లేసులపై 'మామా' అండ్ 'క్వీన్' అని పేర్లు ఉన్నాయి.

సెరెనా విలియమ్స్ తన 17 సంవత్సరాల వయస్సులో 1999లో తన మొదటి US ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచినప్పుడు, ఆమె తన జుట్టులో తెల్లటి ముత్యాలు ధరించింది. అలాగే ఇప్పుడు 40 సంవత్సరాల వయస్సులో ఆమె తన చివరి టోర్నమెంట్ ఆడుతుంది. ఈ సందర్భంగా సెరెనా కుమార్తె ఒలింపియా అచ్చం తన తల్లి వలె జుట్టును ముడి వేసుకుంది.




