- Telugu News Photo Gallery Health Tips Heres Why low sodium salt is not good for health know the Details
Health Tips: పచ్చి కూరగాయలు, పండ్లపై ‘ఉప్పు’ నేరుగా వేసుకుంటున్నారా? దిమ్మతిరిగే నిజాలివి..!
Health tips: చాలా మంది పచ్చి కూరగాయలపై ‘ఉప్పు’ వేసుకుని తింటుంటారు. అలాగే సలాడ్ పైనా సాల్ట్ వేసుకుని తింటుంటారు. చాలామందికి ఇది పెద్ద అలవాటు.
Updated on: Aug 30, 2022 | 10:09 PM

Health tips: చాలా మంది పచ్చి కూరగాయలపై ‘ఉప్పు’ వేసుకుని తింటుంటారు. అలాగే సలాడ్ పైనా సాల్ట్ వేసుకుని తింటుంటారు. చాలామందికి ఇది పెద్ద అలవాటు. ఇలాగే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ అలవాటు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక ఉప్పు తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగానే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. 'యూరోపియన్ హార్ట్ జర్నల్'లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మరణాల ప్రమాదం 24 శాతం వరకు పెరుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. కానీ చాలా మంది రోజువారీ ఆహారంలో 11 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటు అధిక రక్తపోటుతో పాటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నిజానికి, ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఈ కారణంగా, చాలా మంది తక్కువ సోడియం ఉప్పును ఎంచుకుంటారు. అయితే తక్కువ సోడియం ఉప్పు శరీరానికి నిజంగా మంచిదేనా? అనేది కూడా ఒక సందేహం ఉంది.

సోడియం తక్కువగా ఉండే ఉప్పు ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది కానీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు.

సోడియం, పొటాషియం అసమతుల్యత శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఈ మినరల్స్ సరైన మోతాదులో ఉండటం ముఖ్యం. ఇక్కడ ఏకైక మార్గం ఆహారంలో తక్కువ మొత్తంలో ఉప్పును ఉపయోగించడమేనని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేస్తే వ్యాధుల ప్రమాదాన్ని నివారించొచ్చని చెబుతున్నారు.





























