Shanthi: గుడిలో నిద్రపోయి.. దుకాణంలో పనిచేస్తూ.. సోషల్ మీడియా సెన్సేషన్ ‘బంగారం’ నవ్వుల వెనక కన్నీటి గాథ..
ఈ మధ్యన 'బంగారం చెప్పనా' అంటూ ఒక అమ్మాయి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన రీల్స్ నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ బంగారం కథేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎంతోమంది తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో రాణించే వారికి సామాజిక మాధ్యమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అనతికాలంలోనే క్రేజ్‌ను తెచ్చుకుంటున్నారు. అలా ఈ మధ్యన ‘బంగారం చెప్పనా’ అంటూ ఒక అమ్మాయి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన రీల్స్ నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ బంగారం కథేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.
ఇవి కూడా చదవండిView this post on Instagram
అమ్మే నాన్నను చంపేసిందంటూ..
గత నెలరోజులగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బంగారం అసలు పేరు శాంతి.. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు. పదో తరగతి చదువుకున్న శాంతి.. ఓ దుకాణంలో పనిచేస్తుంది. నటన మీద ఇష్టంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించిన ఆమె ఒక్క నెలలోనే సెలబ్రిటీగా మారిపోయింది. తన వీడియోలతో అందర్నీ నవ్విస్తూ.. పొట్టచెక్కలు చేస్తున్న ఈ బంగారం జీవితం వెనుక ఓ కన్నీటి గాథ ఉందట. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి వెళ్లిపోయారట. కన్న తండ్రి కోసం చాన్నాళ్ల పాటు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారట. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితో పాటు ఓ తమ్ముడు ఉన్నాడు.10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం ప్రస్తుతం శాంతి ఓ దుకాణంలో పని చేస్తోంది. అయితే అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైందట. ‘అమ్మే నాన్నని చంపేసిందని అమ్మపై నిందలు వేసి కొట్టారు. అమ్మకి 18 ఏళ్లు ఉన్నప్పుడు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేస్తే.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. నాన్నపై అమ్మకున్న ప్రతిరూపం మేమే కదా. అలాంటిది నాన్నలి అమ్మ ఎలా చంపుతుంది.ఇళ్లల్లో పని చేస్తూ అమ్మ మమ్మల్ని పెంచింది. నన్ను చిన్నప్పుడే హాస్టల్లో చేర్పించింది. కనీసం మాకు ఇల్లు కూడా లేదు.. గుడిలో పడుకునే వాళ్లం.. అద్దెకు ఇల్లు కూడా ఇచ్చేవారు కాదు. అమ్మకి, తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదు. వారి చికిత్స కోసం నా శాయశక్తులా కష్టపడుతున్నాను’ అని ఇటీవల చెప్పుకొచ్చింది శాంతి.
View this post on Instagram
సినిమాలపై ఆసక్తితో.. కాగా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. అలా ఓ రోజు’ బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు’ అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్‌గా, ఇన్నోసెన్స్‌తో చేసిన ఆ వీడియోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది శాంతి. సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్న ఆమె జబర్దస్త్ షోకి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..