Telugu News Entertainment Bollywood Bollywood Actress Amrita Rao opens up on having differences with husband RJ Anmol post son's birth Telugu Cinema News,
Amrita Rao: అందుకే రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయమేస్తోంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అతిథి హీరోయిన్
వివాహ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ నటి అమృతారావ్. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగులో మహేశ్‌బాబు సరసన అతిథి సినిమాలోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ.
వివాహ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ నటి అమృతారావ్. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగులో మహేశ్‌బాబు సరసన అతిథి సినిమాలోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. సినిమా కెరీర్‌లో పీక్స్ ఉండగానే ఆర్జే ఆన్మోల్‌తో ప్రేమలో పడిన అమృత 2016లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2020 నవంబర్‌లో ఒక పండంటి బిడ్డ వీరి జీవితంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం పిల్లాడి పాలనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న అమృత అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ సొగసరి కపుల్ ఆఫ్ థింగ్స్ పేరుతో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. అందులో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా తమ దాంపత్య జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘ ప్రేమలో ఉన్నప్పుడు కానీ వివాహమయ్యాక కానీ సుమారు పదేళ్లపాటు మా మధ్య ఎలాంటి గొడవలు తలెత్తలేదు. అభిప్రాయ బేధాలు రాలేదు. ఎందుకంటే దాదాపు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. అయితే ఎప్పుడైతే మా జీవితాల్లోకి వీర్ (కుమారుడు) వచ్చాడో అప్పటి నుంచే మా మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వాడి పెంపకం విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోలే తీసుకోవాలనుకుంటాడు. నేను చెప్పేవాటిని అసలు పట్టించుకునేవాడు కాదు. అందుకే రెండో బిడ్డను కనాలంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. నాకు తెలిసి అందరి ఇళ్లలోనూ ఇలాంటివి జరుగుతాయనుకుంటాను. వైవాహిక బంధంలో ఇవి కూడా ఒక భాగమనుకుంటున్నాను. కాగా అమృతరావు చివరగా ఠాక్రే అనే సినిమాలో నటించింది.