Rakul Preet Singh: ఈ వయ్యారి ఒంపుసొంపులు కుర్రాళ్లకు కునుకు పట్టనివ్వడంలేదుగా..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఉన్నటుంది ఆఫర్లు తగ్గిపోయి కనిపించకుండా పోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్ కు చేరువలో ఉంది సన్నజాజి తీగ రకుల్ (Rakul Preet Singh).

Rakul Preet Singh: ఈ వయ్యారి ఒంపుసొంపులు కుర్రాళ్లకు కునుకు పట్టనివ్వడంలేదుగా..
Rakul Preet Singh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2022 | 5:01 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఉన్నటుంది ఆఫర్లు తగ్గిపోయి కనిపించకుండా పోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇక బాలీవుడ్ కు వెళ్లి పూర్తిగా టాలీవుడ్ కు దూరమైన భామలు ఉన్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో చేరేలా ఉంది సన్నజాజి తీగ రకుల్ (Rakul Preet Singh). వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ చిన్నది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంది ఈ భామ. ఇక తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి అలరించింది రకుల్. ఇక ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి తెలుగునాట అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. రకుల్ చివరిగా కొండపోలం సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

దాంతో ఇప్పుడు అమ్మడు బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడ క్రేజీ ప్రొజట్స్ లో నటిస్తోంది. రకుల్ నటించిన ఇటీవల అజయ్ దేవగన్ `రన్ వే 34` ఆశించిన విజయం సాధించలేదు. తదుపరి చత్రివాలి, లేడీ కిల్లర్ అనే సినిమాలో చేస్తోంది రకుల్. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ వయ్యారి భామ అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా రకుల్ షేర్  నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. వైట్ కలర్ డ్రస్ లో జాజి పువ్వుల దర్శనమిచ్చింది రకుల్. పర్ఫెక్ట్ ఫిజిక్ తో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతోంది రకుల్.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి