Viral Photo: ఫోటోగ్రాఫర్నే కొట్టేందుకు సిద్ధమైన ఈ బూరెబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి..
అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో అలరించింది. ఎవరో గుర్తుపట్టండి.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు ఫేమస్ సెలబ్రెటీలకు చెందిన బాల్యస్మృతులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చిన్నప్పటి ఫోటోస్ చూసి హీరోహీరోయిన్లకు గుర్తించేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోలో తల్లి ఒడిలో నుంచి ఫోటోగ్రాఫర్ పై కోపంతో కొట్టేందుకు చేయి లేపిన ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో అలరించింది. ఎవరో గుర్తుపట్టండి.
అమాయకపు చూపులతో.. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారు తెలుగు చిత్రపరిశ్రమలో ఫేమస్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు. ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రియాంక. తొలి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ కొట్టేసింది. ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే తెలుగులో మాత్రం ఈ అమ్మడుకు ఆశించినంత ఆఫర్లు రావడం లేదు. దీంతో గత కొంతకాలంగా ఈ అమ్మడు నుంచి ఎలాంటి మూవీ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న ఈ చిన్నది.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.