AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఆస్కార్ బరిలో అలియా భట్ ?.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఆ బ్లాక్ బస్టర్ హిట్..

ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Alia Bhatt: ఆస్కార్ బరిలో అలియా భట్ ?.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఆ బ్లాక్ బస్టర్ హిట్..
Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2022 | 9:00 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఈఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సెషన్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలియా.. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. అలాగే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన గంగూబాయి కతియావాడి చిత్రంలో నటించింది. ఇందులో ఓ వేశ్వ పాత్రలో అలియా నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఉన్నాయి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రాలు ఆస్కార్ బరిలో నిలవడం ఇది మొదటిసారి కాదు. గతంలో రూపొందించిన దేవదాస్ చిత్రం కూడా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఇందులో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం అలియా భట్ బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, నాగార్జున, మౌనీరాయ్, షారుఖ్ ఖాన్, అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

Follow Us
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!