Megastar Chiranjeevi: సీతారామం సినిమాను చూసిన మెగాస్టార్‌ చిరంజీవి.. రివ్యూ ఏమిచ్చారంటే?

Sitaramam: దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. ఆగస్ట్‌5 థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.75కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం అమెరికాలోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

Megastar Chiranjeevi: సీతారామం సినిమాను చూసిన మెగాస్టార్‌ చిరంజీవి.. రివ్యూ ఏమిచ్చారంటే?
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Aug 28, 2022 | 8:26 AM

Sitaramam: దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాళ్ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. ఆగస్ట్‌5 థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.75కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం అమెరికాలోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దుల్కర్‌, మృణాళ్‌ జోడీకి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే రష్మిక, అక్కినేని సుమంత్‌ల అభినయం బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. తాజాగా ఈ అందమైన ప్రేమకావ్యాన్ని మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

‘సీతారామం చూశాను. ఒక చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్ర్కీన్‌ప్లేతో ఈ ప్రేమకథను ఆవిష్కరించిన విధానం నాకెంతగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్‌ గారికి, స్వప్నాదత్‌, ప్రియాంకదత్‌లకు అభినందనలు. అలాగే ఒక ప్యాషన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడికి కూడా అభినందనలు. కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్‌లుగా ప్రేమకథకి ప్రానం పోసిన దుల్కర్‌, మృణాళ్‌లకు, సూత్రధారి పోషించిన రష్మిక మందన్నా, మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో మరెన్నో అవార్డులు, రివార్డులను గెలవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..