Telugu News Entertainment Bollywood Pregnant Alia Bhatt wore Rs 3 lakh pink ruffle dress with pants and waistcoat for Brahmastra promotions, Pics goes viral Telugu Cinema News
Alia Bhatt: పింక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Brahmastra: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్ పరంగానూ మంచి హుషారులో ఉంది. సినిమాల పరంగా గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌తో మంచి హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ
Brahmastra: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్ పరంగానూ మంచి హుషారులో ఉంది. సినిమాల పరంగా గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌తో మంచి హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బ్రహ్మాస్త్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తన భర్త రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో కలిసి నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అటు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందేందుకు రెడీ అయిందీ అందాల తార.
కాగా గర్భంతో ఉండి కూడా తన సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది అలియా. బ్రహ్మస్త్ర రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో భర్తతో కలిసి తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్‌కు చెందిన పింక్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్ల మనసులు దోచుకుంటున్నాయి. దీంతో కొందరు అలియా డ్రెస్ ధర గురించి నెట్టింట్లో ఆరా తీశారు. కాగా గూచీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పింక్ కలర్ చిఫాన్ రఫుల్ టాప్ ధర 4,100 డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 3,27,883 రూపాయలన్న మాట. వామ్మో ఒక్క డ్రెస్‌కే ఇంత ఖర్చు పెట్టిందా? అంటూ అభిమానులు, నెటిజన్లు షాకవుతున్నారు.