Telugu News Entertainment Actress Meghana Raj gets Chiranjeevi Sarja and Raayan's names tattooed on her wrist, Photos goes viral
Meghana Raj: రెండో పెళ్లి రూమర్లకు చెక్.. భర్త, కుమారుడి పేర్లను పచ్చబొట్టు వేయించుకున్న చిరంజీవి సతీమణి
Chiranjeevi Sarja: కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జా ఆకస్మక మరరణంతో మానసికంగా బాగా కుంగిపోయింది ఆయన సతీమణి, ప్రముఖ నటి మేఘనా రాజ్ (Meghana Raj). ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. నటిగా మళ్లీ కెరీర్‌పై దృష్టి సారిస్తోంది.
Chiranjeevi Sarja: కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జా ఆకస్మక మరరణంతో మానసికంగా బాగా కుంగిపోయింది ఆయన సతీమణి, ప్రముఖ నటి మేఘనా రాజ్ (Meghana Raj). ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. నటిగా మళ్లీ కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే మేఘన రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్దికాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవన్నీ వదంతులేనని కొట్టి పారేసిందీ అందాల తార. తాజాగా తన భర్తపై ఉన్న ప్రేమకు ప్రతీకగా అతని పేరును పచ్చబొట్టు వేయించుకుంది. తన భర్త చిరంజీవి సర్జా, కొడుకు రాయన్ పేర్లను మణికట్టుపై ట్యాటూ వేయించుకుంది. వారు ఎప్పటికీ తనగుండెలో ఉండిపోతారంటూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కాగా ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుసుకున్నారు చిరంజీవి సర్జా, మేఘనరాజ్. అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో 2018 మే 2న పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే వీరి పండంటి కాపురాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో.. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో భర్త జ్ఞాపకాల్లోనే బతుకుతూ కొన్ని రోజులు ఇంటికే పరిమితమైంది మేఘన. అయితే అదే ఏడాది రాయన్‌రాజ్ సర్జా పుట్టడంతో మళ్లీ జీవితంపై ఆశలు పెంచుకుంది. తన భర్తకు ప్రతిరూపమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. కాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన బెండు అప్పారావ్ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది మేఘన. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలు తగ్గించేసిన ఆమె త్వరలో బుద్ధివంత 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోందీ అందాల తార.