AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందుకే కదా అందరూ షారుఖ్‌ను ప్రేమించేది.. దివ్యాంగ యువతితో మోకాళ్లపై కూర్చొని డ్యాన్స్ చేసిన బాలీవుడ్‌ బాద్‌షా

Shah Rukh Khan: గత నాలుగేళ్లుగా సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్నఈ స్టార్ హీరో మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. లిటిల్‌ ఛాంప్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓ దివ్యాంగ యువతితో సరదాగా ఆడిపాడాడు.

Viral Video: అందుకే కదా అందరూ షారుఖ్‌ను ప్రేమించేది.. దివ్యాంగ యువతితో మోకాళ్లపై కూర్చొని డ్యాన్స్ చేసిన బాలీవుడ్‌ బాద్‌షా
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Aug 26, 2022 | 5:46 AM

Share

Shah Rukh Khan: బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సూపర్‌స్టార్‌గా ఎదిగిన నటుల్లో షారుఖ్‌ఖాన్‌ ఒకరు. తన నటనతో అభిమానుల మనసుల్లో బాలీవుడ్‌ బాద్‌షాగా, అమ్మాయిల మనసుల్లో రొమాంటిక్‌ హీరోగా స్థానం సంపాదించుకున్నాడీ హీరో. గత నాలుగేళ్లుగా సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న ఈ స్టార్ హీరో మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. లిటిల్‌ ఛాంప్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓ దివ్యాంగ యువతితో సరదాగా ఆడిపాడాడు. తాను హీరోగా నటించిన దిల్‌ సే సినిమాలోని ఛయ్య ఛయ్య పాటకు ఫ్లోర్‌పై మోకాళ్లపై కూర్చొని డ్యాన్స్‌ చేశాడు. సూపర్‌స్టార్‌ తన పక్కన డ్యాన్స్ చేయడం చూసి ఆ అమ్మాయిలో కూడా ఉత్సాహం పొంగి పొర్లింది. కాళ్లు చేతులు ఆడిస్తూ డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ఇందుకే కదా.. 6-60 ఏళ్ల వారెవరైనా అందరూ షారుఖ్‌ను ప్రేమించేది’ అంటూ ఫ్యాన్స్‌ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.

కాగా డ్యాన్స్‌ చేసిన తర్వాత ఆ దివ్యాంగ యువతిని ఆప్యాయంగా హత్తుకున్నాడు షారుఖ్‌. దీంతో ఆమె తెగ సంబరపడిపోయింది. ఇక సూపర్‌స్టార్‌ అనే హోదాను పక్కన పెట్టి షారుఖ్‌ చేసిన పనికి అక్కడున్న న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడుతూ అతనిని మనసారా అభినందించారు. కాగా 2018 జీరో సినిమాలో చివరిగా కనిపించాడు షారుఖ్‌. త్వరలోనే పఠాన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో దీపిక హీరోయిన్‌గా నటిస్తుండగా, జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీంతో పాటు టైగర్‌3, జవాన్‌, డుంకీ సినిమాలు కూడా లైన్లో పెట్టాడీ స్టార్‌ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా