Vikrant Rona: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైన విక్రాంత్‌ రోణ.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

Vikrant Rona OTT Release: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ( Kiccha Sudeep) నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez) హీరోయిన్‌గా నటించింది.

Vikrant Rona: డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైన విక్రాంత్‌ రోణ.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?
Vikrant Rona Ott Release
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2022 | 6:43 AM

Vikrant Rona OTT Release: కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ ( Kiccha Sudeep) నటించిన పాన్‌ ఇండియా చిత్రం విక్రాంత్‌ రోణ. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez) హీరోయిన్‌గా నటించింది. జులై 28న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇంటెన్సివ్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ముఖ్యంగా ఈ సినిమాలో మంగ్లీ పాడిన రక్కమ్మ సాంగ్ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. బిగ్‌స్ర్కీన్లలో అలరించిన విక్రాంత్‌ రోణ ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో సెప్టెంబర్‌ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ జీ5 ఓ వీడియో షేర్‌ చేసింది.

విక్రాంత్ రోణ సినిమాకు అనూప్‌ భండారి దర్శకత్వం వహించగా, మంజునాథ్‌ గౌడ్‌ నిర్మించారు. హీరో హీరోయిన్లతో పాటు నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, రవిశంకర్‌ గౌడ్‌ తదితరులు ఈ సినిమాలో నటించారు. కాగా ఈ సినిమాను డిజిటల్‌ రైట్స్‌ను జీ5 భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో సిల్వర్ స్ర్కీన్‌పై ఈ చిత్రాన్ని చూడలేకపోయిన వారు, ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..