Trailer Talk: ఫస్ట్‌ నైట్‌ జరిగిన మహిళలే ఆ సీరియల్‌ కిల్లర్‌ టార్గెట్‌.. ఉత్కంఠ భరితంగా ఓదేల రైల్వే స్టేషన్‌ ట్రైలర్‌.. ఆహాలో రేపే విడుదల..

Odela Railway Station: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఓదెల రైల్వేస్టేషన్‌'. 2002లో ఓదెల అనే గ్రామంలో జరిగిన వరుస హత్యలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఈ క్రైమ్‌ థ్రిలర్‌ 'ఆహా' (AHA) ఓటీటీ వేదికగా...

Trailer Talk: ఫస్ట్‌ నైట్‌ జరిగిన మహిళలే ఆ సీరియల్‌ కిల్లర్‌ టార్గెట్‌.. ఉత్కంఠ భరితంగా ఓదేల రైల్వే స్టేషన్‌ ట్రైలర్‌.. ఆహాలో రేపే విడుదల..
Odela Railway Station Trail
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2022 | 7:18 AM

Odela Railway Station: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. 2002లో ఓదెల అనే గ్రామంలో జరిగిన వరుస హత్యలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఈ క్రైమ్‌ థ్రిలర్‌ ‘ఆహా’ (AHA) ఓటీటీ వేదికగా 26వ తేదీన (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కొత్తగా పెళ్లై, శోభనం జరిగిన మహిళలను మాటు వేసి హతమార్చిన ఓ సైకో కిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఒక నిమిషం 47 సెకన్ల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నవ వధువులను అత్యాచారం చేసిన హతమార్చుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్న సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌, పూజిత పొన్నాడ, వశిష్ట, సాయి రోనక్‌ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమా సహతత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రానికి సంపత్‌ నంది కథ అందించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించడం విశేషం. కొత్తగా పెళ్లైన మహిళలను హత్య చేస్తోన్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారా.? అసలు ఆ కిల్లర్‌ హత్యలు ఎందుకు చేశాడన్న వివరాలు తెలియాలంటే ఆహాలో విడుదలవుతోన్న సినిమాను చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..