Aha: ఓటీటీ చరిత్రలో తొలి డ్యాన్స్‌ రియాలిటీ షో.. ఆహా డ్యాన్స్‌ ఐకాన్‌ లాంచింగ్‌ ఈవెంట్‌కు లైగర్‌ కపుల్‌..

Aha Dance ikon: తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతోంది. కేవలం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా.. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ...

Aha: ఓటీటీ చరిత్రలో తొలి డ్యాన్స్‌ రియాలిటీ షో.. ఆహా డ్యాన్స్‌ ఐకాన్‌ లాంచింగ్‌ ఈవెంట్‌కు లైగర్‌ కపుల్‌..
Dance Ikon Aha Show
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 25, 2022 | 6:09 PM

Aha Dance ikon: తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతోంది. కేవలం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా.. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్‌ను రూపొందిస్తూ డిజిటల్‌ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సరికొత్త కార్యక్రమానికి ఆహా తెర తీసింది. డ్యాన్స్‌ ఐకాన్‌ పేరుతో రియాలిటీ డ్యాన్స్‌ షోను ప్రసారం చేయనున్నారు. సెప్టెంబర్‌ 11 నుంచి ఈ రియాలిటీ షో ఆహా వేదికగా ప్రారంభంకానుంది.

ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వాహకులు డ్యాన్స్‌ ఐకాన్‌ షో లాంచింగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ప్రముఖ యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక షోలో విజయం సాధించిన వారికి ఒక పెద్ద హీరోకి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇవ్వనుండడం ఈ రియాలిటీ షో ప్రత్యేకత.

ఇదిలా ఉంటే ఈ లాంచింగ్‌ ప్రోగ్రామ్‌కు లైగర్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, అనన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లైగర్‌ చిత్రంలోని ‘అకడి పకడి దిక్క దికిడి’ పాటకు స్టేజ్‌పై చిందులేశారీ లవ్లీ కపుల్‌. ఇక ఈ కార్యక్రమంలో ఆహా యాజమాన్యం కూడా పాల్గొంది. ప్రోమోతోనే డ్యాన్స్‌ ఐకాన్‌ రియాలిటీ షోపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తొలిసారి ఓటీటీ వేదికగా వస్తోన్న ఈ షో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చూస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..