Liger: ‘లైగర్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా.!

కిక్ బాక్సింగ్ నేపధ్యంలో.. పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన 'లైగర్' ఆగష్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Liger: 'లైగర్' ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా.!
Liger Movie Ott
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2022 | 11:33 AM

విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌ కాగా.. ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు. కిక్ బాక్సింగ్ నేపధ్యంలో.. పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ‘లైగర్’ ఆగష్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ చాయ్‌వాలాగా కనిపించాడు. ఇక విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. అలాగే ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి షో నుంచి విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉంటే.. ‘లైగర్’ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ డిజిటల్ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ భారీ మొత్తానికి డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ తొలి వారంలో ఈ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కావొచ్చు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..