Aishwarya Rai: పొన్నియన్‌ సెల్వన్‌ సెట్స్‌ నుంచి ఐశ్వర్యరాయ్‌ ఫొటో లీక్‌.. నెట్టింట వైరల్..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Aug 26, 2022 | 10:38 AM

బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ 'పొన్నియన్‌ సెల్వన్‌' మువీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ రాణీ నందినిగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెట్స్‌ నుంచి తాజాగా..

Aishwarya Rai: పొన్నియన్‌ సెల్వన్‌ సెట్స్‌ నుంచి ఐశ్వర్యరాయ్‌ ఫొటో లీక్‌.. నెట్టింట వైరల్..
Aishwarya Rai

Ponniyin Selvan First Look: బాలీవుడ్‌ అందాల తార ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ మువీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ రాణీ నందినిగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెట్స్‌ నుంచి తాజాగా ఐశ్వర్యరాయ్‌ పాత్రకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక నెటిజన్లు ‘అవర్‌ క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌ (Our queen is back)’ అనే కామెంట్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. కాగా 48 యేళ్ల ఐశ్వర్య రాయ్‌ పెళ్లి తర్వాత చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే కనిపించారు. 2018లో ‘ఫాన్నీ ఖాన్‌’ మువీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ మువీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో కనిపించనున్నారు. జులై 19న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయడం ద్వారా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు అధికారికంగా ఐశ్వర్య ప్రకటించారు.

View this post on Instagram

ఇవి కూడా చదవండి

A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan)

ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ నా ప్రాధాన్యత కుటుంబం, కూతురికే ఇస్తాను. కరోనా మహమ్మారీ కాలంలో ధైర్యం చేసి మనీ సర్‌ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ మువీ చేయడానికి అంగీకరించాను. ఐతే ఇది కూతురు ఆరాధ్య, కుటుంబంపై నుంచి నా ఫోకస్‌ మరల్చలేద’ని అన్నారు. కాగా ‘పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1 తమిళంతోపాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకురానుంది. 1995లో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ పేరుతో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మువీలో ఐశ్వర్యతో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, ఆర్.పార్తీబన్ తదితరులు నటిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu