AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Snacks: ఆఫీస్‌లో వర్క్‌చేసే టైంలో ఆకలిగా అనిపిస్తోందా? ఐతే రోజూ ఇలా చేయండి..

తరచుగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది ఒట్టి అపోహ మాత్రమే. ఐతే ఇది ఎటువంటి ఆహారం తీసుకుంటారనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఆఫీసులో వర్క్‌ చేస్తున్నప్పుడు మధ్యలో ఆకలిగా అనిపిస్తుంది. తినడానికి..

Healthy Snacks: ఆఫీస్‌లో వర్క్‌చేసే టైంలో ఆకలిగా అనిపిస్తోందా? ఐతే రోజూ ఇలా చేయండి..
Healthy Snacks
Srilakshmi C
|

Updated on: Aug 25, 2022 | 1:59 PM

Share

Healthy Snacks for employees: తరచుగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది ఒట్టి అపోహ మాత్రమే. ఐతే ఇది ఎటువంటి ఆహారం తీసుకుంటారనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఆఫీసులో వర్క్‌ చేస్తున్నప్పుడు మధ్యలో ఆకలిగా అనిపిస్తుంది. తినడానికి బయటికి వెళ్లలేని పరిస్థితిలో మీరుంటే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ స్నాక్స్‌ తీసుకోండి. ఇవి మీ కడుపు నిండుగా ఉంచడమేకాకుండా మీ బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

బాదంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బాదంలోని ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువ సమయంపాటు కడుపు నిండుగా ఉండేలా సహాయం పడతాయి. మరొక చిరుతిండి.. పాప్‌కార్న్‌. పాప్‌కార్న్‌లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. పాప్‌కార్న్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ కడుపు నిండుగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మొలకలను కూడా తినొచ్చు. మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా, రుచిగాకూడా ఉంటాయి. మొలకల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆఫీస్‌ అవర్స్‌లో ఆకలిగా ఉంటే తినడానికి ఓట్స్‌ కూడా మంచి ఎంపికే. ఇవి ఆరోగ్యకరమైనవేకాకుండా రుచిగాకూడా ఉంటాయి. ఓట్స్‌తోపాటు ఆహారంలో సీజనల్ ఫ్రూట్‌లను చేర్చుకోవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతిని పొందుతారు.