Beauty tips: ఈ కాఫీ హెయిర్‌ మాస్క్‌లతో జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.. ఎలా తయారు చేసుకోవాలంటే..

ఏ మాత్రం చిరాగ్గా అనిపించినా ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగితే చిటికెలో మంత్రం వేసినట్లు యాక్టివ్‌ అవుతారు. కాఫీ తాగడానికేకాదు జుట్టును సంరక్షించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? గరుకు జుట్టును సిల్కీగా మార్చగలిగే లక్షణం కాఫీకి ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా..

Beauty tips: ఈ కాఫీ హెయిర్‌ మాస్క్‌లతో జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.. ఎలా తయారు చేసుకోవాలంటే..
Coffee Hair Mask
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2022 | 11:43 AM

How to make Coffee Hair Mask: ఏ మాత్రం చిరాగ్గా అనిపించినా ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగితే చిటికెలో మంత్రం వేసినట్లు యాక్టివ్‌ అవుతారు. కాఫీ తాగడానికేకాదు జుట్టును సంరక్షించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? గరుకు జుట్టును సిల్కీగా మార్చగలిగే లక్షణం కాఫీకి ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాఫీతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్‌ మాడు (స్కాల్ప్) శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు మూలాల నుంచి బలంగా చేకూరి ఆరోగ్యంగా పెరుగుతుంది.

కాఫీ పొడితో హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలంటే..

ఒక గుడ్డు సొనలో 3 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన హెయిర్ మాస్క్‌ను వెంట్రుకల మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి. ఈ విధంగా జుట్టు మొత్తాన్ని హెయిర్ మాస్క్‌తో నింపాలి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు వేళ్లతో స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చెయ్యాలి. 15 నిముషాల తర్వాత షాంపుతో తల స్నానం చెయ్యాలి.

ఇవి కూడా చదవండి

రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడికి సమాన పరిమాణంలో తేనెను వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం జుట్టుకు రూట్ నుండి చివరి వరకు పూసుకోవాలి. 40 నిమిషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

3 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్‌తో సమాన మొత్తంలో పెరుగు కలుపుకోవాలి. దీనికి కొన్ని చుక్కలు తాజా నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. 30 నుండి 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చెయ్యాలి.

1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ కలుపుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ కలబంద రసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అనంతరం జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!