- Telugu News Photo Gallery Elon Musk’s ex girlfriend puts up unseen pics of Tesla boss for auction. Here's here whole story
Elon Musk rare pics: రండి బాబూ రండి.. చూడండి..కొనండి! కాలేజీ రోజుల్లో డేటింగ్ ఫొటోలు వేలానికి పెట్టిన ఎలోన్ మాస్క్ మాజీ ప్రియురాలు
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ అయిన ఎలోన్ మస్క్ ఏదో ఒక విషయంతో నిరంతరం వార్తల్లో కనిపిస్తుంటాడు. తాజాగా ఎలోన్ మస్క్ కాలేజీ రోజులకు సంబంధించిన ఫొటోలను అతని మాజీ ప్రేయసి జెన్నిఫర్ గ్వైన్ వేలం వేయాలని నిర్ణయించుకుంది..
Updated on: Aug 25, 2022 | 10:40 AM

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ అయిన ఎలోన్ మస్క్ ఏదో ఒక విషయంతో నిరంతరం వార్తల్లో కనిపిస్తుంటాడు. తాజాగా ఎలోన్ మస్క్ కాలేజీ రోజులకు సంబంధించిన ఫొటోలను అతని మాజీ ప్రేయసి జెన్నిఫర్ గ్వైన్ వేలం వేయాలని నిర్ణయించుకుంది.

మస్క్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ తన కొడుకు చదువుకు అవసరమైన డబ్బు సేకరించడం కోసం అయిన తన కుమారుడి చదువు కోసం ఎలన్ మస్క్ 23 యేళ్ల వయసులో దిగిన ఫొటోలను హౌస్ రౌక్షన్ వెబ్‌సైట్‌లో వేలానికి పెట్టింది. సెప్టెంబర్ 15 వరకు ఎవరైనా వేలంపాటలో ఈ ఫొటోలను కొనుగోలు చేయవచ్చు.

ఈ వేలంలో మస్క్‌కు సంబంధించిన దాదాపు 20 వస్తువులను పెట్టింది. వీటిల్లో మస్క్ తన స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలు, మస్క్ సంతకం చేసిన డాలర్ ఫొటోలు కూడా ఉన్నాయి.

ఎలోన్ మస్క్ 1994లో జెన్నిఫర్ పుట్టినరోజున గిఫ్ట్‌గా ఇచ్చిన గోల్డ్ నెక్లెస్‌ను కూడా వెలంలో పెట్టింది. ఇప్పటివరకు ఎనిమిది మంది దీని కోసం వేలం వేశారు. దీని ధర ఇప్పటివరకు రూ.1,93,044.61లు పలికింది.

ఎలోన్ మస్క్, జెన్నిఫర్ 1994లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో దాదాపు ఏడాది పాటు డేటింగ్ చేశారు. ప్రస్తుతం జెన్నిఫర్ సౌత్ కరోలినాలో తన భర్త, స్టెప్ సన్ (సవతి కొడుకు)తో కలిసి నివసిస్తోంది. తన కొడుకు వేలం కోసం మాత్రమే వేలంలో వీటిని అమ్ముతున్నట్లు చెప్పింది.




