- Telugu News Photo Gallery Cinema photos Anupama parameswaran latest instagram photo gallery 24 08 2022
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్.. హోమ్ ఐసోలేషన్‌లో అనుపమ.. ఈ చిట్టిదాని ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా.
Updated on: Aug 25, 2022 | 12:44 PM

దాదాపు మూడేళ్లుగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఏ ఒక్క రంగాన్నీ విడిచిపెట్టకుండా కొవిడ్ పంజా విసురుతోంది. పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నటులు, సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు కోలుకున్నారు.

తాజాగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనాబారిన పడ్డారు. ఇటీవల కార్తికేయ-2 ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ సౌత్ సహా అనేక ప్రాంతాలకు వెళ్లారు అనుపమ.

ఈ క్రమంలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటపడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ-2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

నిఖిల్‌తో ఆమె నటించిన 18 పేజేస్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే కార్తికేయ-2తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్ పెయిర్‌గా నిలుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Anupama Parameswaran New Photos. Credit by:Anupama Parameswaran/Instagram




