Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moonlighting: విప్రో ఛైర్మన్‌పై నెటిజన్ల ట్రోల్స్ ‘మిస్టర్‌ ప్రేమ్‌జీ! తమరు స్వయంగా 7 కంపెనీలకు డైరెక్టర్‌.. ఇది మోసం కాదా?

టెక్‌ ఉద్యోగులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయకూడదు. సరే! మరి ప్రొఫెషనల్స్‌ సంగతేంటి? ఖాళీ సమయాల్లో వాళ్లేం చేస్తున్నారో పట్టించుకోరా? అని విప్రో ఛైర్మన్‌ రిషద్ ప్రేమ్‌జీని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు..

Moonlighting: విప్రో ఛైర్మన్‌పై నెటిజన్ల ట్రోల్స్ 'మిస్టర్‌ ప్రేమ్‌జీ! తమరు స్వయంగా 7 కంపెనీలకు డైరెక్టర్‌.. ఇది మోసం కాదా?
Wipro Chairman
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2022 | 9:25 AM

‘It’s not is not cheating. Employees have a right to moonlight’: టెక్ ఇండస్ట్రీలో మూన్‌లైటింగ్‌ (ఐటీ ఉద్యోగులు ఏక కాలంలో ఒకటికిమించి ఉద్యోగాలు చేయడం) ట్రెండ్‌ను ‘మోసం’తో సమానమని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ శనివారం (ఆగస్టు 20 ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే రిషద్ ప్రేమ్‌జీ మూన్‌లైటింగ్‌ పోస్టుకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ‘టెక్‌ ఉద్యోగులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయకూడదు. సరే! మరి ప్రొఫెషనల్స్‌ సంగతేంటి? ఖాళీ సమయాల్లో వాళ్లేం చేస్తున్నారో పట్టించుకోరా? అని అధికమంది రిషద్ ప్రేమ్‌జీని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

స్పెక్ట్రమ్‌ ఇరువైపుల ఉన్న సోషల్ మీడియా యూజర్స్ మూన్‌లైటింగ్‌పై తమ అభిప్రాయాలను వివిధ సోసల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వెల్లడించారు. ‘మూన్‌లైటింగ్‌ అనేది ఔట్‌ డేటెడ్‌! ఆఫీసు పనివేళల్లో మేము చేసేపనిపై పూర్తి శ్రద్ధకనబరుస్తాం. ఆఫీస్‌ అవర్స్‌ తర్వాత ఉద్యోగులు ఏం చేస్తారనేది కంపెనీకి అనవసరం’ అని లింక్డ్‌ఇన్‌ బ్రాండ్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ షహ్‌బాజ్‌ మహ్మద్‌ అన్నారు. ‘ఉద్యోగుల ప్రస్తుత పనిపై మూన్‌లైటింగ్‌ ప్రతికూల ప్రభావం చూపనంత వరకు అది మోసం కాదు’ అని ఐఓసీఎల్‌ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ సంజయ్ చతుర్వేది అభిప్రాయపడ్డారు. ‘మూన్‌లైటింగ్‌ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇది మోసం కాదు. ఆఫీస్‌ వెలుపల ఉద్యోగులను నియంత్రించే హక్కు మీకు లేదు. ఇది హాస్యాస్పదమైన స్టేట్‌మెంట్‌’, అనేక కంపెనీల ప్రమోటర్లు ఇతర కంపెనీలు, బోర్డుల్లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇది మూన్‌లైటింగ్ అవుతుందేకానీ, మోసం కాదు. మిస్టర్ రిషద్ ప్రేమ్‌జీ.. మీరు 7 కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇది మూన్‌లైటింగ్‌ కాదా? మూన్‌లైటింగ్‌ ఉద్యోగుల హక్కు అని అధికమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేధికగా రిషద్ ప్రేమ్‌జీని ట్రోల్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ప్రముఖ ఫుడ్‌టెక్ స్టార్ట్-అప్ స్విగ్గీ తమ ఉద్యోగులకు మూన్‌లైటింగ్‌ పాలసీని ఇటీవల తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఖాళీ సమయాల్లో ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు స్విగ్గీ అనుమతించింది. స్విగ్గీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై ప్రస్తుతం సర్వత్రా చర్చ కొనసాగుతోంది.