Petrol Diesel Rate: : క్రూడాయిల్ $ 101 దాటింది.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగేనా..? తాజా రేట్ల వివరాలు

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 25, 2022 | 9:17 AM

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండిపోతుండడంతో దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు..

Petrol Diesel Rate: : క్రూడాయిల్ $ 101 దాటింది.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగేనా..? తాజా రేట్ల వివరాలు
Today Petrol, Diesel Prices in India

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండిపోతుండడంతో దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముడి చమురు బ్యారెల్‌కు $ 100 దాటింది. అలాగే బ్రెంట్ $ 101 పైన పెరిగింది. అయితే దేశంలో వరుసగా 95వ రోజు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులేదు. మే 22 నుండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు క్రూడ్ ఆయిల్ మాత్రమే 100 డాలర్లు దాటింది. క్రూడ్ బ్యారెల్‌కు $ 95.60 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 101.97 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27 ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76 ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89 ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్, ఇతర వస్తువులను జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కావాడనికి ఇదే కారణం.

మీరు ఇంట్లో కూర్చొని పెట్రోల్-డీజిల్ రేట్లను తనిఖీ చేయవచ్చు. అన్ని చమురు కంపెనీలు SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ధరను తనిఖీ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu