LPG Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.750కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. పూర్తి వివరాలు..!

LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరల నిరంతర పెరుగుతున్నాయి. మీరు చౌక సిలిండర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాధారణ ప్రజల కోసం ప్రభుత్వ..

LPG Gas Cylinder: గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.750కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. పూర్తి వివరాలు..!
Lpg Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: Aug 23, 2022 | 6:23 PM

LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరల నిరంతర పెరుగుతున్నాయి. మీరు చౌక సిలిండర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాధారణ ప్రజల కోసం ప్రభుత్వ చమురు సంస్థ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందులో మీరు గ్యాస్ సిలిండర్లను చౌకగా తీసుకోవచ్చు. ఇండేన్ ఈ సదుపాయం కింద మీకు కేవలం రూ.750కే గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1053 ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాదాపు కొద్దిమార్పుల తేడాతో అంతే ధర కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వ సంస్థ ఇండేన్ ద్వారా రూ.750కి సిలిండర్ ఇస్తున్నారు.

కాంపోజిట్ సిలిండర్ సౌకర్యం:

ఈ సిలిండర్‌ను కొనుగోలు చేసేందుకు కేవలం 750 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సిలిండర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కాంపోజిట్ సిలిండర్. అందుకే తక్కువ ధరకు వస్తుంది. సులభంగా ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేసుకోవచ్చు. ఈ సిలిండర్‌కు కారణం కూడా సాధారణ సిలిండర్ కంటే తక్కువగా ఉంటుంది. త్వరలో ఈ సిలిండర్ సదుపాయాన్ని అన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. మీమీ నగరాల్లో ఉంటే కూడా ఈ సిలిండర్‌ను పొందవచ్చు. లేకపోతే కొన్ని రోజులు వేచి ఉండవచ్చు. కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉంటాయి. అందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. ఈ కారణంగా ఈ సిలిండర్ల ధర తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిలిండర్లు ఢిల్లీ సహా మొత్తం 28 నగరాలకుపైగా అందుబాటులో ఉంది. అయితే ఈ సిలిండర్‌ను అన్ని నగరాల్లో అందుబాటులోకి తేవడానికి కంపెనీ కృషి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

10 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర:

ఢిల్లీ – రూ.750 ముంబై – రూ.750 కోల్‌కతా – రూ.765 చెన్నై – రూ.761 లక్నో – రూ.777

14.2 కిలోల సిలిండర్ ధరలు:

ఢిల్లీ – రూ.1053 ముంబై – రూ.1052.5 చెన్నై – రూ.1068.5 కోల్‌కతా – రూ.1079 లక్నో – రూ.1090.5

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి